https://oktelugu.com/

Telangana BJP : వలస పక్షులతో పార్టీని నింపి ఇప్పుడు విచారిస్తే లాభమేంటి?

వలస పక్షులతో పార్టీని నింపి ఇప్పుడు బీజేపీ విచారిస్తే లాభమేంటి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2023 4:07 pm

    Telangana BJP : బీజేపీ తెలంగాణ పరిస్థితి రోజురోజుకు మరో కాంగ్రెస్ లాగా మారిపోయిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దేశం కోణంలో చూస్తే డిఫెరెంట్ గా ఉంది. మోడీ బలమైన జాతీయ నాయకుడు. ప్రపంచం గుర్తించిన నాయకుడు.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న నాయకుడు. భారత్ లో మౌళిక సదుపాయాల కల్పనలతో అంతకు మించిన నేత మరొకరు లేరు. కానీ ఏదో ఎక్కడో ఒఖ చోట లోపం కనిపిస్తోంది.

    బీజేపీ తెలంగాణ పరిస్థితి చూస్తే మచ్చుకైనా జాతీయస్థాయిలోని ఆ పవర్ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీజేపీకి తీసిపోవడం లేదు. వచ్చిన ప్రతివాళ్లను చేర్చుకోవడం.. వారికి పార్టీలో విపరీతమైన పెద్దపీట వేయడం ఎందుకో అర్థం కావడం లేదు. ఇదేం సంస్కృతి..

    కాంగ్రెస్ విమోచన సంస్కృతిని చేస్తామని.. కాంగ్రెస్ సంస్కృతినే ఒంటపట్టించుకుంటున్న బీజేపీ తీరు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగకమానదు.

    జనాలను స్క్రీనింగ్ చేసే కమిటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చైర్మన్ గా చేశారు. ఇక మేనిఫెస్టో కమిటీకి గడ్డం వివేక్ ను చైర్మన్ చేశారు. విజయశాంతికి క్యాంపెయినర్ గా పోస్టు ఇచ్చారు. వీళ్లందరినీ భరిస్తూ పోయేవారికి బీజేపీలో పదవులు ఇవ్వడం ఏంటి?

    వలస పక్షులతో పార్టీని నింపి ఇప్పుడు బీజేపీ విచారిస్తే లాభమేంటి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    వలస పక్షులతో పార్టీని నింపి ఇప్పుడు విచారిస్తే లాభమేంటి? || Telangana BJP || Ram Talk