https://oktelugu.com/

PM Modi – Biren Singh : మణిపూర్ లో బీరేన్ సింగ్ కొనసాగింపు మోడీ చేస్తున్న పెద్ద తప్పిదం

ఈ క్రమంలోనే సీఎంగా అట్టర్ ఫ్లాప్ అయ్యి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్న బీరేన్ సింగ్ ను పక్కకు తప్పించాల్సిన అవసరం ఉంది. ‘మణిపూర్ లో బీరేన్ సింగ్ కొనసాగింపు మోడీ చేస్తున్న పెద్ద తప్పిదంగా చెప్పొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2023 / 06:37 PM IST
    Follow us on

    PM Modi – Biren Singh :  మణిపూర్ జ్వాల ఆరడం లేదు. నిన్న రిలీజ్ అయిన వీడియో దేశం పరువు తీసినట్టైంది. మే 4వ తేదీన వీడియో.. కరెక్ట్ గా పార్లమెంట్ సమావేశాల రోజు రిలీజ్ అయ్యింది. ఆ సంఘటన విషయంలో అందరూ ఖండిస్తున్నారు. అనాగరిక చర్యలకు మద్దతు ఎవ్వరూ ఇవ్వలేదు. మే 4న జరిగింది.. జూలై 21 దాకా ఎందుకు ఆగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

    మణిపూర్ వీడియోలను పార్లమెంట్ ప్రారంభం రోజునే రిలీజ్ చేయడం కుట్రపూరితంగా అనిపిస్తోంది. సంఘటనను సమర్థించడం కాదు.. రిలీజింగ్ తేదీ కూడా ఏదో కుట్ర చేసినట్టు తెలుస్తోంది.

    ఈ సంఘటన మణిపూర్ ప్రభుత్వానికి తెలిసింది. ఆరోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. దీనికి మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. నైతిక విలువలు ఉంటే బీరేన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలి.

    మణిపూర్‌లో గిరిజన తెగ కుకీలు.. మైదాన ప్రాంతానికి చెందిన మైతేయిలకు మధ్య జరుగుతున్న వివాదం చర్చిల విధ్వంసానికి దారి తీస్తోంది. మే 3న ఇరువర్గాల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. అప్పటి నుంచి మైతేయిల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని చర్చిలపై దాడులు కొనసాగుతున్నాయి. అల్లర్ల పేరుతో దుండగులు ఇప్పటి వరకు 289 చర్చిలకు నిప్పు పెట్టారు. క్రిస్టియన్‌ సంఘాలు, మత పెద్దలు ముందు నుంచి చర్చిల విధ్వంసంపై ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా వ్యూహంతోనే మణిపూర్‌లో చర్చిలపై దాడులు జరుగుతున్నాయని ఇంఫాల్‌ ఆర్చిబిషప్‌ డోమ్నిక్‌ లుమోన్‌ గతనెలలో ఆరోపించారు

    ఈ క్రమంలోనే సీఎంగా అట్టర్ ఫ్లాప్ అయ్యి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్న బీరేన్ సింగ్ ను పక్కకు తప్పించాల్సిన అవసరం ఉంది. ‘మణిపూర్ లో బీరేన్ సింగ్ కొనసాగింపు మోడీ చేస్తున్న పెద్ద తప్పిదంగా చెప్పొచ్చు.

    మణిపూర్ లో బీరేన్ సింగ్ కొనసాగింపు మోడీ చేస్తున్న పెద్ద తప్పిదం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.