Kalki – Kamal Haasan : కల్కిలో కమల్ హాసన్ రోల్ ఇదే… ప్రభాస్ తో కురుక్షేత్రమే!

కమల్ హాసన్ మాట్లాడుతూ... చెడు లేకుండా మంచి లేదు. కాబట్టి నెగిటివ్ రోల్ అనేది సినిమాలో చాలా కీలకం అన్నారు. విలన్ అనేవాడు లేకపోతే హీరో పాత్రకు ప్రాధాన్యత లేదన్న అర్థంలో కమల్ హాసన్ మాట్లాడారు. హీరో ప్రభాస్ కాబట్టి కమల్ హాసన్ తాను విలన్ అని చెప్పకనే చెప్పాడు.

Written By: Shiva, Updated On : July 21, 2023 6:38 pm
Follow us on

Kalki – Kamal Haasan : ఇండియా మొత్తం కల్కి మేనియా నడుస్తుంది. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 వేదికగా టైటిల్, ప్రోమో విడుదల చేశారు. కల్కి ఫస్ట్ లుక్ విమర్శలకు గురి కాగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అసలు ఇది ఒరిజినలా లేక మార్ఫింగ్ చేశారా? దీని కంటే ఫ్యాన్ మేడ్ బెటర్ కదా? అనే విమర్శలు వినిపించాయి. అయితే టీజర్ తో అనుమానాలు పటాపంచలు చేశారు. గురువారం అర్ధరాత్రి విడుదలైన కల్కి  2898 AD  టీజర్ మెప్పించింది. అత్యున్నత సాంకేతికత, నిర్మాణ  విలువలు కలిగి ఉంది. 

 
సినిమాలో విషయం ఉంది. దర్శకుడు  నాగ్ అశ్విన్ భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే మూవీ చేస్తున్నారనే నమ్మకం బలపడింది. కాగా కొద్ది రోజుల క్రితం కమల్ హాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు. కల్కి మూవీ యూనిట్ తరపున కామిక్ కాన్ లో ఆయన కూడా పాల్గొన్నారు. కల్కి సినిమా తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ పరోక్షంగా తన రోల్ పై క్లారిటీ ఇచ్చారు. 
 
కమల్ హాసన్ మాట్లాడుతూ… నేను ప్రాజెక్ట్ కే ఒప్పుకోవడానికి ఒక కారణం ఉంది. నేను సారూప్యత గల సినిమాలలో నటించారు. చెడు లేకుండా మంచి లేదు. కాబట్టి నెగిటివ్ రోల్ అనేది సినిమాలో చాలా కీలకం, అన్నారు. అంటే విలన్ లేనిదే హీరో లేడు.  విలన్ అనేవాడు లేకపోతే హీరో పాత్రకు ప్రాధాన్యత లేదన్న అర్థంలో కమల్ హాసన్ మాట్లాడారు. హీరో ప్రభాస్ కాబట్టి కమల్ హాసన్ తాను విలన్ అని చెప్పకనే చెప్పాడు. 
 
ఇప్పటికే కమల్ హాసన్ విలన్ రోల్ చేసే ఆస్కారం కలదని ప్రచారం జరిగింది. కమల్ హాసన్ లేటెస్ట్ కామెంట్స్ తో అది మరింత బలపడింది. కమల్ హాసన్ చాలా చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. అయితే ఇతర హీరోల చిత్రాల్లో చేసింది లేదు. భారతీయుడు, అభయ్ చిత్రాల్లో కమల్ డ్యూయల్ రోల్ చేయగా… మరొక రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. కల్కిలో ఆయన పూర్తి స్థాయిలో నెగిటివ్ రోల్ లో మెప్పించే అవకాశం ఉంది.