Bigg Boss Telugu Season 6: సాధారణంగా బిగ్ బాస్ లో అందరూ కుదుటపడ్డాక ఒక వారానికి కానీ టాస్కులు, ఎలిమినేషన్లు పెట్టరు. కానీ హౌస్ లోకి ఇలా 21 మంది ఎంటర్ అయ్యారో లేదో అప్పుడే బిగ్ బాస్ నామినేషన్స్ పెట్టేశారు. ఈసారి తొలి రోజు నుంచి గొడవలు, కొట్లాటలు, ఏడుపులు పెడబొబ్బలు పెట్టేశారు. కంటెస్టెంట్ల సత్తా తెలుసుకునేందుకు గేమ్ లు ఆడించాడు బిగ్ బాస్.

క్లాస్, మాస్, ట్రాష్ అంటూ మూడు గ్రూపులుగా విడగొట్టి కెప్టెన్సీ రేసులోకి క్లాస్ వారిని.. ఎలిమినేషన్ లోకి ట్రాష్ వారిని నెట్టేసాడు బిగ్ బాస్. క్లాస్ టీంలోకి తొలుత బాలాదిత్య, శ్రీహాన్, సూర్య వెళ్లగా.. ట్రాష్ లోకి రేవంత్, గీతూ, ఇనయా సుల్తానా వెళ్లారు. తర్వాత సమయానుసారం గేమ్ లు ఆడిస్తూ వారిని అటూ ఇటూ మార్చేశాడు. గెలిచిన వారిని క్లాసులోకి.. ఓడిన వారిని ట్రాష్ లోకి మార్చారు.
Also Read: Udaya Bhanu: బిగ్ బాస్ 6 లోకి ఉదయభాను అందుకే వెళ్ళలేదు.. బయటపడ్డ సంచలన నిజాలు
బిగ్ బాస్ పెట్టిన గేమ్ లో ఓడిపోయిన ఇనయా కోపంతో రగిలిపోయింది. తనకు హౌస్ లోని ఇంటి సభ్యులు అస్సలు మద్దతు ఇవ్వడం లేదంటూ వారిపై అరిచేసింది. గోల చేసింది. ఏడ్చేసింది. ఆదిరెడ్డిపై పరుష పదజాలంతో విరుచుకుపడింది. ఓటమిని జీర్ణించుకోలేక ఓ పక్క ఏడుస్తూనే వాదనకు దిగడంతో ఆమెపై ఇంటి సభ్యులే కాదు..ప్రేక్షకులు కూడా చిరాకు పడ్డ పరిస్థితి.
ఫైనల్ గా బిగ్ బాస్ గేమ్స్ అన్నీ ముగిశాక నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్ టీంలోకి వెళ్లడంతో వారు ఈ వారం నామినేషన్స్ లో లేరని బిగ్ బాస్ ప్రకటించాడు. వీరు కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించాడు.

ఇక గేమ్స్ లో ఓడిపోయి ట్రాష్ టీంలోకి వచ్చిన బాలాదిత్య, అభినయశ్రీ, ఇనయా సుల్తానాలు ఈ వారం నేరుగా నామినేషన్ లోకి వచ్చారు. ఈ ముగ్గురిలో ప్రవర్తన, ఫాలోయింగ్ కారణంగా బాలాదిత్య ఖచ్చితంగా సేవ్ అవుతాడని అర్థమవుతోంది. ఇక అందరిపై అరుస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇనాయాపై వ్యతిరేకత బాగా ఉంది. అభినయశ్రీ పెద్దగా ఏమీ చేయకపోవడంతో ఆమె రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే తొలి రోజు నుంచే హౌస్ లో రెచ్చిపోతున్న ఆర్జీవీ ముద్దుగుమ్మ ‘ఇనాయా’ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం ఖాయమని అంటున్నారు. ఆమె ప్రవర్తన, ఓవరాక్షన్ ఇంటి సభ్యులకు, ఇటు ప్రేక్షకులకు నచ్చడం లేదు. సో ఓటింగ్ లో ఆమెనే ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అటున్నారు.
[…] Also Read: Bigg Boss Telugu Season 6: ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స… […]