Pawan Kalyan Tweet: ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ కేవలం ఒక సినిమా హీరోనే కాదు, ఆయనలో గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు. అంతకు మించిన మానవతావాది ఉన్నాడు. అన్నిటికీ మించి ఆయనలో గొప్ప పండితుడు ఉన్నాడు, అలాగే గొప్ప రచయిత కూడా ఉన్నాడు. అందుకే, పవన్ మాటల్లో ఎంతో లోతు ఉంటుంది.

ఆ లోతుల్లోకి వెళ్లి తపన పడితే గానీ, పవన్ లోని భావం అర్ధం కాదు. తాజాగా పవన్ తనలోని అంతర్మథనాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. లోతైన మనసు మూలల నుంచి ఉద్భవించే శక్తి అంటూ గొప్ప వ్యాఖ్యలను ఆయనే స్వయంగా రాసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read: Janasena-BJP Merger: పవన్ కల్యాన్ సీఎం: బీజేపీ.. జనసేన.. ఓ విలీన రాజకీయం?
ఇంతకీ పవన్ పోస్ట్ చేసిన ఆ మెసేజ్ ఏమిటో చదువుదాం రండి. ‘‘లోతైన మనస్సు మూలల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి కలిగి వుంటుంది. అది చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారుతూ, మొదట సాటివారిని తరువాత సమూహాలను ఆపై సమాజాన్ని ప్రభావితం చేసి బడబాగ్నిలా మారుతుంది. అటువంటి లోతైన ఆలోచన శబ్దబేరీలకు చెదరదు.. గందరగోళాలకు బెదరదు.. తర్కానికి అందదు.. కంటికి కనిపించదు. అడ్డుగా ఉన్న అడ్డంకులను భళ్ళున పగులగొట్టుకుని రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుంది!’’ అని పవన్ కళ్యాణ్ రాసి మెసేజ్ చేశారు. ఇది చూసి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది.

అసలు ఒక సూపర్ స్టార్ అయ్యి ఉండి కూడా రాజకీయాల్లో అవినీతి చీకటిలో ఉన్న వారిని న్యాయమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తిగా శక్తిగా పవన్ ప్రయాణం సాగుతుంది. ఈ ఆర్థిక సమాజానికి కొన్ని కొలతలు, లెక్కలు మాత్రమే అర్ధమవుతాయి. కానీ, పవన్ లెక్క వేరు. ఆయనకు ఉన్న తిక్క వేరు.
సింపుల్ గా చెప్పాలంటే.. పవన్ ఒక యోగి లాంటి వాడు. తన జీవితాన్ని జీవించడంలో తనకంటూ కొన్ని సూత్రాలు నిర్మించుకొని లక్షల మంది జీవితాలకు దిశను నిర్దేశం చేస్తున్న గొప్ప యోగి. తానూ అన్వేషించి దర్శించే మహర్షి లాంటి యోగి.
పవన్ కళ్యాణ్ రాసినట్టే.. తన ఆలోచన తర్కానికి అందదు.. కంటికి కనిపించదు. అడ్డుగా ఉన్న అడ్డంకులను మాత్రం భళ్ళున పగులగొట్టుకుని రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుంది. అలాగే వ్యాపించాలని కోరుకుందాం.
లోతైన మనస్సు మూలల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి కలిగివుంటుంది. అది చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారుతూ, మొదట సాటివారిని తరువాత సమూహాలను ఆపై సమాజాన్ని ప్రభావితం చేసి బడబాగ్నిలా మారుతుంది…
— Pawan Kalyan (@PawanKalyan) September 6, 2022
[…] […]
[…] […]
[…] […]