Bigg Boss 7 Telugu : ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్న బిగ్ బాస్… టీఆర్పీ ఢమాల్? ఇది దారుణమైన మిస్టేక్!

ఇక నామినేషన్స్ నుండి పూర్తిగా అమ్మాయిలను తొలగించడం అన్ ఫెయిర్ గేమ్ అన్నమాట వినిపిస్తుంది. ఇలా అయితే టీఆర్పీ ఢమాల్ అయ్యే ఛాన్స్ కలదు.

Written By: NARESH, Updated On : November 6, 2023 3:55 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ పదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందుకు బిగ్ బాస్ ఇంటిని బిగ్ బాస్ మహా రాజ్యంగా మార్చారు.ఈ రాజ్యానికి శోభా,ప్రియాంక,రతిక,అశ్విని నలుగురు రాజా మాతలు.. వారి నిర్ణయమే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ ప్రకటించారు.ఇక నలుగురు రాజమాతలకు నాలుగు సింహాసనాలు వేశారు. ముందుగా అమర్ దీప్,భోలే ని నామినేట్ చేశాడు. గత వారం బాల్స్ టాస్క్ లో భోలేని వీక్ అంటూ వీర సింహాలు అన్నారు. మీరు వీక్ అని వాళ్ళు అంటే .. మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అంటూ అమర్ పాయింట్ రైజ్ చేసాడు. దానికి భోలే నా డిఫెన్సె గురించి మాట్లాడడానికి .. నీకేం హక్కుందయ్యా అంటూ ఇచ్చిపడేసాడు.

తర్వాత గౌతమ్ ‘అర్జున్ ని,యావర్ ని గేమ్ లో ఉంచి గౌతమ్ ఎందుకు వెళ్ళిపోవాలి’ అనగానే నువ్వు యాక్టీవ్ కెప్టెన్ అయ్యా .. నువ్వు .. అంటూ శివాజీ అన్నాడు. నేను నిన్ను వద్దు అనుకుంటే.. సందీప్ ఎందుకు దండేస్తాను అంటూ శివాజీ వాదించాడు. మధ్యలో రాజమాత అశ్విని ‘ అన్న గురించి నేను ఏం చెడుగా మాట్లాడలేదు అది కూడా చెప్పాలి’ అని గౌతమ్ తో చెప్పింది.

దాంతో శివాజీ ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్,గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో గౌతమ్ ‘ వాడిని కెప్టెన్సీ నుంచి ఎవరు తీసేస్తే వారిని నామినేట్ చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్,అమర్ ని నామినేట్ చేశాడు. ఇక ఇద్దరు వాదనకు దిగారు.కంటెస్టెంట్స్ మధ్య ఎప్పటిలానే గొడవలు జరిగాయి.

ఇక చివర్లో శివాజీ ‘నేను పంచభూతాల సాక్షిగా చెబుతున్న అంటూ ఒట్టు శపధాలు చేసాడు. ఇక అందరి వాదనలు విన్న రాజ మాతలు.. భోలే ఇంకా గౌతమ్ మీద కత్తి పోట్లు వేశారు. అంటే వీళ్లిద్దరు నామినేట్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ నామినేషన్స్ గురించి పూర్తి క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ చూడాలి మరి. ఇక నామినేషన్స్ నుండి పూర్తిగా అమ్మాయిలను తొలగించడం అన్ ఫెయిర్ గేమ్ అన్నమాట వినిపిస్తుంది. ఇలా అయితే టీఆర్పీ ఢమాల్ అయ్యే ఛాన్స్ కలదు.

గతంలో కూడా పిచ్చి టాస్కులు పెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. కన్నీళ్లను గ్లాస్ లో నింపమన్న టాస్క్ కూడా వివాదానికి దారితీసింది. బిగ్ బాస్ ఇచ్చే ఇష్టమొచ్చిన టాస్క్ వల్లనే దాని టీఆర్పీరేటింగ్ పడిపోతున్నట్టుగా  చెబుతున్నారు.