Bigg Boss Telugu 7 : బిగ్ బాస్.. ఇదేం న్యాయమయ్యా.. నాగార్జున నువ్వైనా చెప్పాలి కదయ్యా!

అలాంటి కీలకమైన పోటీకి బలబలాలు చూసుకోకుండా ఇలా ఇష్టమున్న ఫిజికల్ టాస్కులు పెట్టడం ఏంటి బిగ్ బాస్ ఇది అన్యాయం అని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్ లు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 9, 2023 10:48 pm
Follow us on

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ లో ఈసారి ‘ఉల్టా ఫుల్టా’ అని నాగార్జున ఏ క్షణాన అన్నాడో కానీ అన్నీ తేడాతేడాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు పడుకోవడానికి సరైన బెడ్లు లేక కిందనే పడుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 14 మందిలో ఎవరూ కన్ఫమ్ కాలేదని ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు వీకెండ్ లో నాగార్జున వచ్చి 14 మందిలో ఒకరిని హౌస్ లో కన్ఫమ్ చేశారు. వివిధ టాస్కుల్లో టాప్ లో నిలిచిన ఇద్దరికీ పోటీ పెట్టి అందులో విజేతగా నిలిచిన ఒకరికి ‘పవర్ అస్త్ర’ను ఇచ్చేసి అతడికే ఈ హౌస్ లో తొలి కన్ఫమ్ సీటు వచ్చిందని ప్రకటించారు.

అయితే దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. హౌస్ లో పోటీల విషయంలోనూ ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. నిన్న ఇద్దరు మల్లయోధులను హౌస్ లోకి రప్పించి వారితో ఎంత సేపు ఫైట్ చేస్తే వారే విజేతలు అన్నారు. షకీల లాంటి ముసాలవాడ.. శివాజీ లాంటి మోకాలు నొప్పి ఉన్న వారు మల్లయోధులతో పోటీపడలేకపోయారు. ఇక బలమైన ఉస్తాదులైన యావత్, డాక్టర్ గౌతమ్ లు తేలిపోయారు. ఈ పోటీలో సందీప్, ప్రియాంకలు విజేతగా నిలిచారు. అయితే వీరిద్దరూ కూడా మల్ల యోధులతో తెలివిగా పోట్లాడి కింద కూర్చుండి ఎక్కువ సేపు నిలిచి గెలిచారు.

మంచి మంచి కంటెస్టెంట్లు ఉన్నా కూడా మల్ల యోధుల పోటీలో గెలవలేకపోయారు. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలకు ఒకే పోటీ పెట్టడం.. ముసలివారు.. ముతకవారికి అదే పోటీ పెట్టడం విమర్శలకు తావిచ్చింది.

తాజాగా ఫైనల్ పోటీలోనూ అదే కథ. బలమైన డ్యాన్సర్ అయిన సందీప్ స్టామినా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయనతో పోటీకి పొట్టిపిల్ల అయిన ప్రియాంకను దింపాడు. ఇద్దరికీ ఒకే రకమైన ఫిజికల్ ట్యాక్స్ ఇచ్చాడు. ఒక బ్యాలెన్సర్ పై ఇద్దరూ బ్యాలెన్స్ చేసుకుంటూ తమ బుట్టల్లో బాల్స్ వేయాలని చెప్పారు. ఇందులో ఫిజికల్ గా బలవంతుడైన సందీప్ ఎక్కువ బాల్స్ వేసి విజేతగా నిలిచాడు. ఫిజికల్ గా వీక్ అయిన ప్రియాంక శక్తి మేర ప్రయత్నించినా అబ్బాయి బలం ముందు తేరిపోయింది.

అయితే ఇలా బలమైన అబ్బాయికి.. బలహీన అమ్మాయికి ఒకేరకమైన పోటీపెట్టడంపైనే విమర్శలు చెలరేగాయి. బిగ్ బాస్ లో గేమ్ లు న్యాయంగా పెట్టాలని.. అబ్బాయికి, అమ్మాయికి శక్తిసామర్థ్యాలను అంచనావేసి పెట్టాలంటూ బిగ్ బాస్ కు ప్రేక్షకులు హితవు పలుకుతున్నారు. కనీసం హోస్ట్ నాగార్జున అయినా ఇలాంటి టాస్క్ పెట్టడంపై బిగ్ బాస్ నిర్వాహకులకు చెప్పాలని కోరుతున్నారు.  ఈ పవర్ అస్త్రంతో 5 వీక్ లకు ఇమ్యూనిటీ లభిస్తుంది. అలాంటి కీలకమైన పోటీకి బలబలాలు చూసుకోకుండా ఇలా ఇష్టమున్న ఫిజికల్ టాస్కులు పెట్టడం ఏంటి బిగ్ బాస్ ఇది అన్యాయం అని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్ లు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.