Pawan Kalyan – Ashwini : పవన్ కళ్యాణ్ తో కారవాన్ లో అలాంటి అనుభవం… కల్లోకి వచ్చే వాడంటూ బాంబు పేల్చిన బిగ్ బాస్ అశ్విని!

పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్. ఆయన పెద్ద హీరో అని ఇష్టం పెంచుకోలేదు. ఆయనతో వర్క్ చేసిన తర్వాతే నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సార్ సెట్స్ లో నాతో బాగా ఉండేవారు. ఆయన తినే డ్రై ఫ్రూట్స్ నాకు ఇచ్చేవారు.

Written By: NARESH, Updated On : November 25, 2023 8:16 pm
Follow us on

Pawan Kalyan – Ashwini : బిగ్ బాస్ సీజన్ 7 ఐదవ వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విని .. అంద చందాలతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అశ్విని అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ఈ క్రమంలో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైనా అనుభూతులను పంచుకుంది అశ్విని.

పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్. ఆయన పెద్ద హీరో అని ఇష్టం పెంచుకోలేదు. ఆయనతో వర్క్ చేసిన తర్వాతే నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సార్ సెట్స్ లో నాతో బాగా ఉండేవారు. ఆయన తినే డ్రై ఫ్రూట్స్ నాకు ఇచ్చేవారు. అశ్విని కుమార్ అని అనేవారు. ఆయనకు ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు. అశ్విని పాట పాడమ్మా అనేవారు. రోజులో ఒక్కసారి మాత్రమే షూటింగ్ కి పిలిచేవారు. మిగిలిన టైం అంత క్యారవాన్ లోనే .. సార్ తో పాటు ఉండేదాన్ని. టైం కి తినడం కబుర్లు చెప్పుకోవడం .. ఫోన్లు చూసుకోవడం చేసేదాన్ని.

ఆడెవడన్నా .. వీడెవడన్నా సాంగ్ షూట్ జరుగుతున్నపుడు .. నేను కార్ లో ఉండిపోయాను. పవన్ సార్ తో సహా అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. తిడతారేమో అని భయపడ్డాను. కో డైరెక్టర్లు వచ్చి తిట్టారు. భయపడుతూ సార్ దగ్గరకి వెళ్లి సారీ చెప్పాను. ఆయన .. ఇట్స్ ఓకే అశ్విని .. నువ్వు ఛిల్ అవ్వు .. సైలెంట్ గా ఉండు అని కూల్ చేసారు. ఆ సీన్ లో దేవుడులా కనిపించారు.

ఆయన పై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ .. నేను ఎప్పటికి మర్చిపోలేని అనుభూతులు ఉన్నాయి. ఆయనతో పిచ్చి పిచ్చి డ్రీమ్స్ వచ్చేవి. ఇంటికి వెళ్ళాక కూడా కలలోకి వచ్చేవారు. సెట్స్ లో ఆయన ఏం తింటారో .. అక్కడ ఉండే వాళ్ళ అందరికి అదే పెట్టించేవారు. ఆ ఫుడ్ ని టేస్ట్ చేసి మరీ అందరికి కడుపునిండా పెడతారు. అది ఆయన వ్యక్తిత్వం అంటూ చెప్పుకొచ్చింది అశ్విని శ్రీ.