Bigg Boss 7 Telugu : నాకు క్లాస్ పీకుతున్నావా? నీ కాళ్లు పట్టుకోమంటావా? రతికపై శివాజీ ఫైర్..

కొందరు కావాలని తమ అవకాశాల కోసం నా పేరును అవసరానికి మించి వాడుతున్నారు , అలాంటి వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు

Written By: NARESH, Updated On : September 25, 2023 6:14 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి చాలా సరికొత్తగా జరుగుతుంది. మొదటగా హౌస్ లోకి 14 మందిని పంపించారు. అందులో చెప్పుకోదగిన కంటెస్టెంట్స్ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆయా కంటెస్టెంట్స్ ఆడుతున్న విధానం కావచ్చు, బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కావచ్చు . షో మీద అందరికీ ఆసక్తి ని కలిగించేలా చేస్తున్నాయి.

నిన్న నాగార్జున ముందు ‘వాళ్లద్దరి చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ శివాజీ ఏకంగా రతిక-పల్లవి ప్రశాంత్ బంధంపై కామెంట్ చేస్తాడు. దీనికి నాగార్జున కూడా సెటైర్లు వేస్తాడు. అలా అన్నందుకు మరుసటి రోజైన సోమవారం శివాజీని నిలదీసింది రతిక. దీనికి సారీ చెప్పిన శివాజీ.. నువ్వు హర్ట్ అయినందుకు కాళ్లు పట్టుకోమంటావా? అంటూ ఫైర్ అయ్యారు.

ఇప్పటికి పూర్తయిన మూడు వారాల్లో ముగ్గురు కంటిస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్ , రెండో వారం షకీలా , మూడో వారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం ఎలిమినేట్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం పూర్తి అయ్యింది. లైవ్ లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షో ఇది పూర్తి అయ్యింది. ఈ వారం రతిక రోజ్ , టేస్టీ తేజ, ప్రియాంక , శుభశ్రీ , గౌతమ్ కృష్ణ , ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు.

అయితే ఈ సారి నామినేషన్ సమయంలో అనవసరమైన గోలకు తావులేకుండా బిగ్ బాస్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లు ఆ రీజన్ చెప్పి అవతల కంటెస్టెంట్‌తో పాటు జ్యూరీ మెంబర్స్‌ని కూడా ఒప్పించాలి. ఈ జ్యూరీలో ఇప్పటికే హౌస్ మెట్స్ అయిన సందీప్, శివాజీ, శోభా శెట్టిలు ఉన్నారు. నామినేట్ చేయాలి అనుకున్న వాళ్ళని బోను లో నిలబెట్టి రీజన్స్ చెప్పాలి. అంతే కాకుండా జ్యూరి మెంబర్స్ ను కూడా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా రతిక ను శుభశ్రీ నామినేట్ చేసింది. అస్తమానం హౌస్ లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టాపిక్ తీసుకొని వస్తుందని, ఇక్కడ లేని ఒక వ్యక్తి గురించి, బయట ఉన్న సెలెబ్రిటీ గురించి మాట్లాడటం బిగ్ బాస్ రూల్స్ కు విరుద్ధమని అందుకే రతిక ను నామినేట్ చేస్తున్నానంటూ చెప్పింది. దానికి జ్యూరి మెంబర్స్ కూడా అంగీకరించటంతో రతికను నామినేట్ చేశారు. ఇప్పటికే రతిక విషయంలో రాహుల్ సిప్లిగంజ్ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. కొందరు కావాలని తమ అవకాశాల కోసం నా పేరును అవసరానికి మించి వాడుతున్నారు , అలాంటి వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు