Bigg Boss 7 Telugu Nomination List : తొలివారం నామినేషన్స్ లిస్ట్ లీక్… ఆ ఏడుగురిలో ఒకరు అవుట్!

కారణం ప్రేక్షకులకు తన టాలెంట్ ఏమిటో తెలియజేసే లోపే, హౌస్ గురించి అర్థం చేసుకోకుండానే ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది.

Written By: NARESH, Updated On : September 4, 2023 8:12 pm

Bigg boss 7 telugu

Follow us on

Bigg Boss 7 Telugu Nomination List : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం(సెప్టెంబర్ 3న) ఘనంగా ప్రారంభమైంది. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారు. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మందితో షో లాంచ్ కాలేదు. అలాగే మరో ట్విస్ట్ ఉందని చెప్పారు. హౌస్లోకి వెళ్లిన వాళ్లంతా హౌస్ మేట్స్ కాదన్నారు. ఎవరైతే కష్టపడి, బాగా ఆడి పవర్ అస్త్ర గెలుచుకుంటారో వారికే హౌస్ మేట్స్ గా మారే అవకాశం ఉందన్నారు. హౌస్ ని మూడు భాగాలుగా విభజించారు. స్టాండర్డ్, డీలక్స్, వీఐపీ అంటూ మూడు సెగ్మెంట్స్ ఏర్పాటు చేశారు.

పెర్ఫార్మన్స్ ని బట్టి ఎవరు ఏ రూమ్ లో ఉండాలో డిసైడ్ చేస్తారనిపిస్తుంది. ఇక హౌస్లోకి వెళ్లిన 14 మంది కంటెస్టెంట్స్ ఎవరంటే… ప్రియాంక సింగ్, శివాజీ, దామిని, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, షకీల, ఆట సందీప్, శోభిత శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతిక, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, నటుడు అమర్దీప్ చౌదరి వరుసగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారు.

నేడే సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. హౌస్లోకి ప్రవేశించిన రోజు వ్యవధిలో ఒకరిని నామినేట్ చేసి ఇంటి నుండి బయటకు పంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 14 మంది కంటెస్టెంట్స్ ఇతర కంటెస్టెంట్స్ ప్రవర్తన ఆధారంగా నామినేట్ చేయాల్సి ఉంది. నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ లీక్ కాగా పేర్లు బయటకు వచ్చారు. మొదటి వారానికి 7గురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.

అత్యధిక ఓట్లు పొందిన గౌతమ్ కృష్ణ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, శోభా శెట్టి, రతికా, షకీలా నామినేట్ అయ్యారు. అంటే వీరిలో ఒకరు వచ్చే ఆదివారం హౌస్ వీడనున్నారు. మొదటివారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దురదృష్టవంతులు అని చెప్పొచ్చు. కారణం ప్రేక్షకులకు తన టాలెంట్ ఏమిటో తెలియజేసే లోపే, హౌస్ గురించి అర్థం చేసుకోకుండానే ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ అన్ లక్కీ ఫెలో ఎవరో చూద్దాం…