Bigg Boss 7 Telugu: 17వ రోజు హైలైట్స్… శివాజీకి అమర్ దీప్ ఝలక్, శోభా శెట్టి ముందు బట్టలు తీసేసి జిమ్ చేసిన గౌతమ్!

ఇక కిచెన్ లో రతికా రోజ్-యావర్ మధ్య రొమాంటిక్ సీన్ చోటు చేసుకుంది. రతికా కోసం చపాతీలు వేసి తినిపించాడు. ఇద్దరూ ఒకే ప్లేట్ లో భోజనం చేశాడు. వీరిద్దరి సరసాలు చూసి పల్లవి ప్రశాంత్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.

Written By: Shiva, Updated On : September 21, 2023 8:35 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్ గా 3వ వారంలో అడుగుపెట్టింది. ఇక 17వ రోజు హౌస్లో జరిగిన విశేషాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. శివాజీ రెండో కంటెండర్ గా పవర్ అస్త్ర గెలిచిన విషయం తెలిసిందే. ఆ పవర్ అస్త్ర పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న శివాజీని నాగార్జున కూడా హెచ్చరించారు. అయినా దాన్ని భద్రంగా దాచుకోవడంలో శివాజీ ఫెయిల్ అయ్యాడు. అమర్ దీప్ చౌదరి దాన్ని కాజేశాడు. తన పవర్ అస్త్ర దొంగిలించారని తెలుసుకున్న శివాజీ ఫైర్ అయ్యాడు. దీని వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరో వాళ్ళ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చాడు…

ఇక కిచెన్ లో రతికా రోజ్-యావర్ మధ్య రొమాంటిక్ సీన్ చోటు చేసుకుంది. రతికా కోసం చపాతీలు వేసి తినిపించాడు. ఇద్దరూ ఒకే ప్లేట్ లో భోజనం చేశాడు. వీరిద్దరి సరసాలు చూసి పల్లవి ప్రశాంత్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. దీనిపై శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, దామిని చర్చ పెట్టారు. కంటెండర్ గా పనికి రాడని రతికా అతనికి వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా ఇంతలా ఆమెను ప్రేమిస్తున్నాడని శుభశ్రీ అన్నది. వాడు రతికా మాయలో పడ్డాడు. యావర్ పని అయిపోయినట్లే అని గౌతమ్ అన్నాడు.

ఇక మూడో కంటెండర్ రేసులో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ప్రిన్స్ యావర్ కి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఎవరు ఏం చేసినా ఒక చోట నుండి నిర్ణీత సమయం వరకూ తల తీయకూడదని చెప్పాడు. ఈ టాస్క్ లో కూడా రతికా రోజ్ ప్రిన్స్ యావర్ ని ఇబ్బంది పెట్టింది. ముఖం మీద గడ్డి, పేడ కూడా వేశారు. అయినా ప్రిన్స్ యావర్ తల తీయలేడు. అతడు టాస్క్ లో గెలిచాడు.

కన్ఫెషన్ రూమ్ లో శోభా శెట్టికి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళ వీడియోలు బిగ్ బాస్ చూపించాడు. పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ… ఆమెకు కంటెండర్ కావడానికి అర్హత లేదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన గౌతమ్ కృష్ణతో శోభా శెట్టి గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాడి వేడి ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. మాట మాట పెరిగి గౌతమ్ బాడీ వరకూ వెళ్ళింది. దాంతో ఆమె ముందు గౌతమ్ చొక్కా విప్పేసి జిమ్ చేశాడు. అవసరమైతే ప్యాంటు కూడా తీసేస్తా అన్నాడు.

నీకు ఇంట్లో ఉండే అర్హత లేదని గౌతమ్ కృష్ణ శోభా శెట్టిని అన్నాడు. నీ కంటే ఎక్కువ వారాలు హౌస్లో ఉండి చూపిస్తా అని శోభా శెట్టి ఛాలెంజ్ విసిరింది. మూడో వారం ఎలిమినేషన్ కి అమర్ దీప్, ప్రియాంక, దామిని, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.