Bigg Boss 6 Telugu: తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో ‘బిగ్ బాస్’. అత్యధిక రేటింగ్ సంపాదించే ఈ షో కోసం జనాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అత్యధిక వీక్షకాదరణ ఉన్న ఈ రియాలిటీ షో ఈ సాయంత్రం నుంచి లాంచ్ చేస్తున్నారు ప్రముఖ హీరో నాగార్జున.. ఇప్పటికే ఐదు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఈరోజు 6వ సీజన్ ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోల్లో బిగ్ బాస్ ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సెప్టెంబర్ 4న ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది.

ఈ షో ప్రారంభానికి ముందే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా లీకైంది. ఇక ఈ సరికొత్త సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఈ సీజన్ లో ఈసారి 17 మందిని ఫైనల్ చేశారట బిగ్ బాస్ టీం. అందులో భాగంగా 15మందిని ఓకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నట్టు తెలిసింది. మిగతా ఇద్దరినీ వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారని సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకారం.. కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే.. ఈసారి కొంత మంది పేరున్న ప్రముఖులను తీసుకున్నట్టు అర్థమవుతోంది.
-సీనియర్ యాంకర్ ఉదయభాను
-జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటి
-హీరో నందు
-యూట్యూబర్ శ్రీహాన్
-సింగర్ మోహన భోగరాజ్
-టీవీ 9 యాంకర్ ప్రత్యూష
-యాంకర్ వర్షిణి
-సింగర్ రేవంత్
-నటుడు బాలాదిత్య
-సుదీప పింకీ
-యాంకర్ నేహా చౌదరి
-యూట్యూబర్ ఆది రెడ్డి
-నటి, మోడల్ ఇనయా సుల్తానా
-కొరియోగ్రాఫర్ పప్సీ మాస్టర్
-యువ హీరోయిన్ సంజనా చౌదరి
ఇక వీరే కాదు. జబర్ధస్త్ అప్పారావు, గీతూ రాయల్, మెరినీ, కీర్తి భట్, రాజ్ శేఖర్, ఆరోహి రావు, వాసంతి కృష్ణన్, అభినయశ్రీ, శని సాల్మాన్, అర్జున్ కళ్యాణ్, జబర్ధస్త్ ఫైమా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

కానీ పైన లిస్ట్ మాత్రం పక్కా అయ్యిందని.. కింది వారు సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా తీసుకోవచ్చని అంటున్నారు. ఈ సాయంత్రం హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారన్నది తేలబోతోంది.
ఇక సింగర్ రేవంత్ హౌస్ లోకి వెళ్లేది ఖాయమైంది. ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే టైటిల్ నాదేనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. మీ ఓటింగ్స్ ద్వారా ప్రేమ, మద్దతుతో టైటిల్ గెలిచి వస్తాను అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇతడి ఎంట్రీ ఖరారు అయ్యిందని అందరికీ అర్థమైంది.
Also Read:Surekha Vani: సురేఖా వాణి తెగింపు… ఆ హీరోకి వంద ముద్దులిస్తానంటూ ఓపెన్ ఆఫర్