Bigg Boss 6 Telugu Elimination: బిగ్ బాస్ తొలి వారం జోరుగా సాగుతోంది. అప్పుడే అలకలు, కొట్లాటలు, గొడవలతో హౌస్ దద్దరిల్లిపోతోంది. బిగ్ బాస్ లో మొన్న నామినేషన్స్ సందర్భంగా మొదలైన రచ్చ నిన్న కూడా కంటిన్యూ అయ్యింది. తొలి వారం నామినేషన్స్ లో అత్యధికంగా సింగర్ రేవంత్ ను నామినేట్ చేశారు. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి తొలి వారం నామినేషన్స్ లో రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనాయా, అభినయశ్రీ, ఆరోహి లు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వేచిచూడాలి. ప్రవర్తన పరంగా చూస్తే ఇనాయా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మొదటి వారంలోనే నామినేషన్స్ లో అందరూ టాప్ సెలబ్రెటీలు ఉండడంతో ఎవరు ఎమిలినేట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. అయితే పాపులారిటీ పరంగా సింగర్ రేవంత్ కు అత్యధిక ఓట్లు పడుతున్నాయని.. ఆ తర్వాత స్థానంలో రెండో ప్లేసులో జబర్ధస్త్ ఫైమాకు ఎక్కువ ఓట్లు పడ్డాయని సమాచారం. ఇక మూడో ప్లేసులో శ్రీసత్య, నాలుగో స్థానంలో చలాకీ చంటి ఉన్నట్టు తెలిసింది. 5వ స్తానంలో ఆరోహీ రావు, 6వ స్థానంలో అభినయశ్రీ ఉన్నారు. చిట్టచివరన ఇనాయా సుల్తానా ఉంది.
జబర్ధస్త్ ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ టైన్ మెంట్ పంచుతోంది. ఆమె చేసిన కామెడీకి కొంతమంది కంటెస్టెంట్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుండగా.. మరికొంత మంది హర్ట్ అవుతున్నారు. ఇక అందరికీ నోట్లో నాలుకలా ఉంటూ చలాకీగా ఉంటున్న ఫైమా ఓటింగ్ లో మొదటి రెండు స్థానాల్లో ఉండడం ఆసక్తిరేపుతోంది.
దీన్ని బట్టి ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదని ఆమె ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ వారం అందరికంటే తక్కువగా ఇనాయాకు ఓట్లు పడుతున్నాయి. ఆమె దురుసు ప్రవర్తన ఇందుకు కారణం అంటున్నారు.
