Bigg Boss 6 Telugu Revanth : బిగ్ బాస్ సీజన్ 6లో తొలి వారమే బరెస్ట్ అయిపోతున్నాడు సింగర్ రేవంత్. చిన్న చిన్న కారణాలకు అతడు భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాడు. తొలి వారంలో అత్యధిక మంది నామినేషన్ చేసింది సింగర్ రేవంత్ నే. అతడి ప్రవర్తన.. దురుసు ప్రవర్తన.. ఒకరు చెప్పింది వినకుండా వారి మీద పడిపోతున్నాడు. మాటలు అంటే పడను అంటూ ఎదురుదాడి చేస్తున్నాడు.

ఇప్పటికే ఫైమాతో, ఆరోహీ రావుతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆరోహీ రావు తెలంగాణ యాసలో రేవంత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఇక యూట్యూబర్ ఆది రెడ్డితోనూ రేవంత్ గొడవ పెట్టుకున్నాడు. వీరిద్దరినీ ఇంటి సభ్యులంతా దూరంగా తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక మిగలిన ఇంటి సభ్యులను కూడా మీ తీరు బాగోలేదంటూ తనకు సపోర్టు చేయడం లేదని అందరి ముందే అరుస్తున్నాడు. బాలాదిత్య, చంటి లాంటి వాళ్లు సర్ది చెప్పినా కూడా సింగర్ రేవంత్ వినడం లేదు.
అందరూ ఏకాకిని చేయడంతో రేవంత్ తాను ఇంటి నుంచి వెళ్లిపోతానని.. ఇలాగే ఉంటానని.. నచ్చకపోతే ప్రేక్షకులు ఓటు వేయవద్దని.. బిగ్ బాస్ కూడా తన ప్రవర్తన బాగాలేదంటే పంపించాలని కోరడం సంచలనమైంది.
దీంతో ఈ వారం వీకెండ్ లో హోస్ట్ నాగార్జున గట్టిగానే రేవంత్ కు క్లాస్ పీకడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. హౌస్ లోంచి వెళ్లిపోతానంటున్న రేవంత్ అసలు ఎందుకు వచ్చావంటూ గడ్డి పెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. బిగ్ బాస్ కూడా రేవంత్ కు ఇదే విషయంపై వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. రేవంత్ ప్రవర్తనపై షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం.