AP Elections 2024: ఎన్నికల నామ సంవత్సరం. అప్పట్లోనే అన్ని పూర్తి చేసుకోవాలి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలోకి దిగాలి. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. వరుసగా ఈ లోపు సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ‘భీమ్లానాయక్’ పూర్తి కావడంతో ఇప్పుడు పెండింగ్ లో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ మూవీ ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా మొదలైంది. కానీ ఈ రెండు సినిమాలు ఇంకా పూర్తికాకముందే పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలకు ఓ భారీ కార్పొరేట్ డీల్ కుదర్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
2024లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వెళుతున్న పవన్ కళ్యాణ్ కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ లోపు ఈ నాలుగు సినిమాలు పూర్తి చేసి ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే మొదలుపెట్టిన రెండు సినిమాలే కాకుండా తాజాగా మరిన్ని చిత్రాలకు సైన్ చేయడం సంచలనమైంది.
Also Read: Telugu Desam Party: నాలుగు దశాబ్దాల పయనం…పడిలేస్తూ..లేచిపడుతూ ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ
‘హరిహర వీరమల్లు’ వంటి భారీ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉంచబడినప్పటికీ.. పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాలను ఓ కార్పొరేట్ కంపెనీకి చేయడానికి అంగీకరించడం విశేషం. పవన్ మరిన్ని చిత్రాలకు సైన్ చేయడం సంచలనమైంది.
తాజాగా రెండు చిత్రాల కోసం పవన్ కళ్యాణ్ ‘జీ స్టూడియోస్’తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ‘వినోదయ సీతమ్’ అనే రిమేక్ సినిమాను పవన్ కళ్యాణ్ తో నిర్మించేందుకు జీ గ్రూప్ ఇప్పటికే అంగీకరించింది. దీనికోసం భారీ పెట్టుబడి పెడుతోంది.
ఇక ఈ సినిమానే కాదు మరో భారీ డీల్ క్లోజ్ చేసేందుకు కూడా ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ ఒప్పందం కుదిరితే పవన్ కళ్యాణ్ తదుపరి రెండు సినిమాలకు జీ పూర్తిగా ఫైనాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం కుదిరితే పవన్ కళ్యాణ్ తన తదుపరి రెండు సినిమాలకు జీ గ్రూప్ యే నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
ఈ నాలుగు సినిమాలు పూర్తయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం రెండు చిత్రాలు పూర్తి చేసి 2023 సగంలోగా ఆ రెండూ చిత్రాలను పూర్తి చేసి ఎన్నికలకు ఆరు నెలల ముందు పూర్తిగా ఏపీ రాజకీయాలకు అంకితం కావడానికి పవన్ రెడీ అయినట్టు సమాచారం.
Also Read: BJP Focus On Telangana: తెలంగాణపై ఢిల్లీ నేతల కన్ను.. ఏప్రిల్ లో మరింత హీటెక్కనున్న రాజకీయాలు
Recommended Video:
