Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమురంభీముడో..’ పాటలో నటించడం చాలా కష్టంగా అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సాంగ్ ఛాలెంజింగ్‌గా అనిపించిందని.. రకరకాల భావోద్వేగాలు చూపాల్సి వచ్చిందని తెలిపాడు. స్నేహితుడు మోసం చేశాడన్న బాధతో పాటు అమాయకత్వం, అడవిబిడ్డల ధైర్యం ఇలా అన్ని రకాల వేరియేషన్స్ ఆ పాటకు అవసరమన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకు ఎక్కువగా నచ్చిన సీన్ కూడా అదేనని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే…టాలీవుడ్‌పై అగ్రదర్శక నిర్మాత కరణ్ జోహర్ ప్రశంసలు కురిపించారు. తెలుగులో వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలని, రొటీన్ సినిమాలు కాకుండా కొత్త దారిని ఎంచుకోవాలన్నారు. బాలీవుడ్‌లో మూసధోరణి కొనసాగుతుందని.. కానీ తెలుగులో తమ సొంత ఆలోచనలతో కథలు రాస్తారు. అందుకే ఇటీవల వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాలీవుడ్‌లో కూడా గొప్ప విజయాలు సాధించాయని అన్నారు.
Also Read: Aryan Khan: ప్చ్.. ఆ స్టార్ హీరో కొడుకుని వదిలేలా లేరు
ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా నటులు, సిబ్బందికి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశాడు. డైరెక్టర్ రాజమౌళి, రాంచరణ్, అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, కీరవాణి, టెక్నికల్ టీం.. ఇలా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాడు. రాజమౌళి తనలోని అసలైన నటుడిని బయటకు తెచ్చాడని తెలిపాడు. చెర్రీ లేకుండా ఆర్ఆర్ఆర్ చేయడం ఊహించుకోలేనన్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రకు అతడు తప్ప ఎవరూ న్యాయం చేయలేరని పేర్కొన్నాడు.
మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమాపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. అందరూ కాసేపు రాజకీయాలు పక్కనబెట్టి కశ్మీరీ పండిట్లకు సాయం చేయాలని హితవు పలికారు. ఆయన సినిమా గురించి మాట్లాడుతూ.. ‘కశ్మీరీ పండిట్ల ఇళ్లకు వెళ్లి సాయం చేద్దాం. వాళ్లకు సపోర్ట్ సిస్టంలా ఉందాం. అంతేకానీ, వాళ్లపై సినిమాలు తీసి రూ.కోట్లు సంపాదించడం తప్పు’ అని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
Also Read: Legendary Directors Of Tollywood: ఆ కోరికతో అల్లాడిపోతున్న లెజెండరీ దర్శకులు
Recommended Video: