https://oktelugu.com/

Deepika Padukone : బాలీవుడ్ క్రేజీ బ్యూటీకి అరుదైన అవార్డు

Deepika Padukone : బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. మానసిక ఒత్తిడి పై అవగాహన కల్పిస్తూ అందించిన సేవలకు గానూ.. ఆమెకు టైం 100 ఇంపాక్ట్ అవార్డు దక్కింది. తాజాగా ఆమె ఈ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘ఈ సోమవారం శుభవార్తతో మొదలైంది’ అంటూ దీపికా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో దీపికాకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. .మరోపక్క దీపికా పెళ్లి […]

Written By:
  • Shiva
  • , Updated On : March 29, 2022 / 01:48 PM IST
    Follow us on

    Deepika Padukone : బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. మానసిక ఒత్తిడి పై అవగాహన కల్పిస్తూ అందించిన సేవలకు గానూ.. ఆమెకు టైం 100 ఇంపాక్ట్ అవార్డు దక్కింది. తాజాగా ఆమె ఈ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘ఈ సోమవారం శుభవార్తతో మొదలైంది’ అంటూ దీపికా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో దీపికాకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    Deepika Padukone

    .మరోపక్క దీపికా పెళ్లి తర్వాత బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ప్రస్తుతం ఆమె గెహ్రాహియా అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లో గ్లామర్‌ డోస్‌ పెంచిన దీపికాను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదేమిటి ? దీపికా మరీ ఇంత పచ్చిగా రెచ్చిపోయింది ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెట్టారు. అయితే, దీపికా మాత్రం ఓవర్ రొమాంటిక్ సీన్స్ ను చాలా బాగా సమర్థించుకుంది.

    Also Read: Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    ఈ గెహ్రాహియా సినిమా అక్రమ సంబంధం నేపథ్యంలో సాగుతుంది. అందుకే, నేను అలా రెచ్చిపోయాను. అయితే, సెట్‌ లో అందరి ముందు కోస్టార్స్‌ తో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం అంత ఈజీ కాదు. ఒక నటిగా ఎంతో అనుభవం ఉన్న నేనే ఆ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ.. ఇలాంటి ఇబ్బందులు సినిమాకి అవుట్ ఫుట్ కి ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే.. నేను రొమాన్స్ విషయంలో అసలు ఎలాంటి పరిధి పెట్టుకోలేదు’ అంటూ దీపికా చెప్పుకొచ్చింది.

    Deepika Padukone

    పైగా ఈ రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఆకర్షించడం కోసమే కాకుండా.. కథ కోసమే డైరెక్టర్ సీన్స్ క్రియేట్ చేశాడని.. అందుకే అలాంటి సీన్స్ చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద తన బోల్డ్ సీన్స్ తో అభిమానులకు దీపికా షాకిచ్చిందనే చెప్పాలి. అన్నట్టు ఆ షాక్ అభిమానులకే కాదు, ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కి కూడా. తన ముద్దు సీన్స్ గురించి తన భర్త ఎలా ఫీల్ అయ్యాడు అనే విషయం గురించి కూడా దీపికా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

    ‘ఈ సినిమా చూసిన రణ్ వీర్ సింగ్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా అందరి హృదయాలను తాకుతుంది అని చెప్పాడు’ అని చెప్పుకోచింది దీపికా. మరీ రణ్ వీర్ సింగ్ నిజంగానే ఎమోషనల్ అయ్యాడా ? లేక భార్య గారి ముద్దులు చూసి ఫీల్ అయ్యాడా ? ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా దీపికా తాజాగా టైం 100 ఇంపాక్ట్ అవార్డు అందుకోవడం విశేషం.

    Recommended Video:

    Tags