Bheemla Nayak Theatrical Trailer Talk : ఒకరిదేమో పోలీస్ పంతం.. ఇంకొకరిది ఆధిపత్యమే ఆసొంతం.. ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో ‘భీమ్లానాయక్ ’ ట్రైలర్ రుచిచూపించింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అతడిని ధీటుగా ఎదురించే విలన్ గా రానా అంతే ఆవేశపూరితంగా నటించాడు. ఇద్దరు కొదమ సింహాల్లా సాగిన ఈ ట్రైలర్ ఆసాంతం పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉంది.

ట్రైలర్ నల్లమల అడవుల్లోని ఒక గ్రామం చుట్టూ సాగినట్టుగా తెలుస్తోంది. ‘పులి పెగ్గేసుకొని పడుకుంది కానీ స్లోగా పోనీయ్’ అని పవన్ స్టామినా గురించి రానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అడవులు.. ఓ గ్రామంలో అవినీతికి పాల్పడుతున్న రానాను నిలువరించే పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించాడు. వీరిద్దరి మధ్య సాగే యుద్ధమే ‘భీమ్లానాయక్’ మూవీగా కనిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆత్రూతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైంది. పవన్ వీరావేశానికి.. రానా పంతానికి మధ్య సాగిన యుద్ధంగా ఉంది. ఇక భీమ్లానాయక్ తగ్గ భార్యగా నీత్యమీనన్ ఇరగదీసింది. ఒంటిపై యూనిఫాం చూసుకొని చెలరేగిపోయే భర్తకు ఇంకాస్త రెచ్చగొట్టే పవర్ ఫుల్ లేడీగా కనిపించారు.
Also Read: Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ టికెట్స్ బుకింగ్ షాకింగ్ నిర్ణయం
ఇక రావురమేశ్ విలన్ బ్యాచ్ లో పవన్ ను ఎదురించే వ్యక్తిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ పోలీస్ జాబ్ పోయి అంతకుమించి సామాన్యుడిగా రానాతో ఫైట్ చేసినట్టుగా కథలో కనిపిస్తుంది. అసలు కథేంటి? అన్నది ట్రైలర్ లో పూర్తిగా రివీల్ చేయలేదు. సినిమా చూస్తే కానీ అసలు విషయం ఏంటనే తెలియదు.
నాగవంశీ నిర్మాతగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ భీమ్లానాయక్ మూవీని ‘సాగన్ కే చంద్ర’ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈరోజు ప్రీరిలీజ్ లోనే ట్రైలర్ ను లాంచ్ చేయాల్సి ఉన్నా ‘మంత్రి గౌతం రెడ్డి’ మరణంతో వాయిదాపడింది. కానీ ఫ్యాన్స్ కు ఊపు తెచ్చేలా ట్రైలర్ మాత్రం రిలీజ్ అయ్యింది. అది ఉర్రూతలూగిస్తోంది.
[…] Also Read: Bheemla Nayak Theatrical Trailer Talk : భీమ్లా నాయక్ ట్రైలర్ ర… […]
[…] Also Read: Bheemla Nayak Theatrical Trailer Talk : భీమ్లా నాయక్ ట్రైలర్ ర… […]
[…] Gadwal Bidda Mallikarjuna Reddy: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తయారయ్యారు. ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే సెలబ్రిటీలుగా చూసేవాళ్లం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని తమ ట్యాలెంట్ తో చాలామంది పాపులర్ అయిపోయారు. అలాంటి వ్యక్తే గద్వాల్ రెడ్డి బిడ్డ. కాగా అతను చిన్న వయసులోనే ఎంత ఫేమస్ అయ్యాడో.. అంత త్వరగా కన్నుమూశాడు. అయితే అతనికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. […]