Balakrishna Unstoppable 2 Show Pawan Kalyan Entry : అగ్రహీరో నందమూరి బాలయ్య తొలిసారి బుల్లితెర ఓటీటీలో చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్’. ఆహా ఓటీటీలో ఆయన చేస్తున్న ఈ షో తొలి సీజన్ గ్రాండ్ హిట్ అయ్యింది. నాడు సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య వారి వ్యక్తిగత విషయాలను రాబట్టారు. మద్యం నుంచి వివాహా, ఇతర ఇష్టాయిష్టాలు, పర్సనల్ విషయాలను బయటకు లాగి షోకు విశేష ప్రాచుర్యం కల్పించారు.

మొదటి సీజన్ పూర్తికావడంతో ఇప్పుడు రెండో సీజన్ పట్టాలెక్కింది. తొలి వారమే తన బావ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును తీసుకొచ్చి.. అల్లుడు నారా లోకేష్ ను కూర్చుండబెట్టుకొని వారి ఫ్యామిలీ, వ్యక్తిగత సీక్రెట్స్ పై కుండబద్దలు కొట్టినట్టు అడిగి రక్తికట్టించాడు. చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ల సరదా సంభాషనకు రికార్డులు నమోదయ్యాయి. లక్షల వ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టేలా వచ్చే కార్యక్రమం ఉండబోతోంది. ఎందుకంటే అక్కడ వచ్చేది జనసేనాని, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరీ.. జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ వస్తే ‘అన్ స్టాపబుల్’ ఉంటుందా? దాన్ని ఆపేతరం ఎవరితరం కాదు.. పవన్ కళ్యాణ్ తో బాలయ్య బాబు కలిస్తే దబిడదిబిడే..
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చినట్టు తాజా ప్రోమో చూపిస్తోంది. పవన్ చేయిపట్టుకొని మరీ బాలయ్య ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఆ ప్రోమో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆసక్తి రేపుతోంది. మెగా, నందమూరి అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ షో చూడాలని.. పవన్ ఏం చెప్తారో వినాలన్న ఆతృత పెరిగిపోతోంది. పవన్ ఆహా ఓటీటీలో బాలయ్య టాక్ షో ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలు కొడుతుందని అత్యధిక వ్యూయర్ షిప్ సాధిస్తుందని అంటున్నారు.