Hijab Controversy : బిగ్ బ్రేకింగ్: హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

Hijab Controversy : కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన హిజాబ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులిచ్చారు. నిషేధాన్ని జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. జస్టిస్ దులీప్ మాత్రం ఇది సరికాదన్నారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా కర్నాటక హిజాబ్ నిషేధం వ్యవహారం పై భిన్న అభిప్రాయాలతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు […]

Written By: NARESH, Updated On : October 13, 2022 11:51 am
Follow us on

Hijab Controversy : కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన హిజాబ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులిచ్చారు. నిషేధాన్ని జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. జస్టిస్ దులీప్ మాత్రం ఇది సరికాదన్నారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.

తాజాగా కర్నాటక హిజాబ్ నిషేధం వ్యవహారం పై భిన్న అభిప్రాయాలతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. వేరు వేరుగా తీర్పులు ఇచ్చిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుదాన్షు ధులియాలు ఈ కేసును తేల్చలేకపోయారు.

కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్ధించగా.. కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వుని రద్దు చేసిన జస్టిస్ సుదాన్షు ధులియా ఈ కేసును తెగ్గొట్టలేకపోయారు.

భిన్న తీర్పుల నేపథ్యంలో ఈ అంశాన్ని సిజేఐ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా వెల్లడించారు.

-హిజాబ్ వివాదం ఏమిటీ?
హిజాబ్ అంటే ముస్లిం మహిళలు ముఖం తల కనిపించుకుండా కట్టుకునే వస్త్రం.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని ‘హిజాబ్ ’ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు.   1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు.

అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది. హిజాబ్ ధరించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది.ఇదేవివాదం అయ్యి పలువురు కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు ఈ కేసును తేల్చలేకపోతోంది.