Balakrishna: బాలయ్యా.. మళ్లీ తడబడ్డాడు.. వైరల్ వీడియో

బాలయ్యకు ఇంతటి పెద్ద సభలో అవకాశం ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అసలే బాలయ్య అదో టైపు .. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు.. ఎలా మాట్లాడాలో తెలియదు.

Written By: Dharma, Updated On : December 21, 2023 11:26 am

Balakrishna

Follow us on

Balakrishna: బాలయ్య మైక్ అందుకుంటే ఏం మాట్లాడతారో తెలియదు.. ఎటు నుంచి ఎటు వైపు వెళ్తారో తెలియదు. నాన్నగారు అంటూ మొదలుపెట్టి.. రాజకీయాలు, సినిమాలు, ఆధ్యాత్మికం మీదుగా ఎటో వెళ్తుంది ఆయన ప్రసంగం. చివర్లో మా బ్లడ్, మా బ్రీడు అంటూ డైలాగ్స్ కొడతారు. ప్రతి మాటకు గ్యాప్ సాగడం. వినేవారికి బోర్ కొడుతుంది. తాజాగా యువగళం విజయోత్సవ యాత్రలో సైతం బాలకృష్ణ ఇదే తరహా ప్రసంగం చేసి టిడిపి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టారు. అసలే చలి.. ఆపై నస ప్రసంగంతో కార్యకర్తలకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎన్టీఆర్ వారసుడని చూడకుండా విసురుగా మాట్లాడిన వారు ఉన్నారు. ఈలోగా సోషల్ మీడియాలో ఈ నటసింహానికి వ్యతిరేకంగా వీడియోలు వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తమకు తప్పదన్న రీతిలో టిడిపి శ్రేణులు పెద్దగా స్పందించలేదు.

అసలు బాలయ్యకు ఇంతటి పెద్ద సభలో అవకాశం ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అసలే బాలయ్య అదో టైపు .. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు.. ఎలా మాట్లాడాలో తెలియదు. అటువంటి వ్యక్తికి వక్తగా అవకాశం ఇవ్వడం ఏమిటి? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తెలుగు భాష పై అపారమైన పట్టు ఉంది. కానీ వ్యక్తపరచడంలో బాలకృష్ణ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. కుదురుగా సమావేశంలో కూర్చుని పెడితే సరిపోయేది అని… అనవసరంగా మాట్లాడే వారి జాబితాలో ఆయన పేరు ఎందుకు చేర్చారు అన్నవారు కూడా ఉన్నారు.

స్పష్టంగా యువగళం అని ఉచ్చరించడానికి కూడా బాలకృష్ణ ఇబ్బంది పడడానికి చూసి వేదిక పైన ఉండే నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కిందన టిడిపి అభిమానులు సైతం నవ్వుకున్నారు. ‘ఆయనే ఉంటే ఈ తెల్లచీర ఎందుకు’ అంటూ.. ఇవన్నీ ఉంటే బాలకృష్ణ సీఎం అయ్యుండేవాడు కదా అని సర్దుకున్న వారు ఉన్నారు. అయితే వారి సొంత పార్టీ అభిమానులు కాబట్టి ఎలాగోలా సర్దుకున్నారు కానీ.. వైసీపీ సోషల్ మీడియాకు కోతికి కొబ్బరి చిప్పలా బాలకృష్ణ ప్రసంగం కనిపించింది. రకరకాల మిమ్స్ పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. లోకేష్ ఎక్కడ తడబడతాడా? బుక్ చేద్దాం అంటూ వెయిట్ చేసిన వారికి బాలకృష్ణ అడ్డంగా దొరికిపోయారు. లోకేష్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు.