Bhagavanth Kesari Collection : భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్… బాలయ్య మూవీకి ఇలాంటి కలెక్షన్సా?

ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ రీత్యా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సి ఉంది. రూ. 66 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాలయ్య బరిలో దిగాడు.

Written By: NARESH, Updated On : October 19, 2023 8:15 pm
Follow us on

Bhagavanth Kesari Collection : లెజెండ్ తర్వాత బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఎన్టీఆర్ బియోపిక్స్ తో చరిత్ర తిరగరాద్దామని బాలయ్య భావించాడు. అనూహ్యంగా ఆ సినిమాలు షాక్ ఇచ్చాయి. హైప్ మధ్య పార్ట్ 1 కనీసం ఓపెనింగ్స్ రాబట్టింది. పార్ట్ 2కి అవి కూడా లేదు. ఎన్టీఆర్ మహానాయకుడు థియేటర్స్ ఎదుట ఉచిత ప్రదర్శన బోర్డులు వెలిశాయి. తర్వాత విడుదలైన చిత్రాలు కూడా ఆడలేదు. బాలయ్య కెరీర్ ప్రశ్నార్థకంలో పడగా అఖండ చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యాడు. బయ్యర్లకు భారీ లాభాలు పంచాడు. వీరసింహారెడ్డి మూవీతో 2023 సంక్రాంతి బరిలో దిగాడు.

మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న వీరసింహారెడ్డికి పండగ సీజన్ కలిసొచ్చింది. స్వల్ప లాభాలతో హిట్ స్టేటస్ అందుకుంది. భగవంత్ కేసరి మూవీతో ఆయన హ్యాట్రిక్ మీద కన్నేశాడు. అఖండ, వీరసింహారెడ్డి వసూళ్ల నేపథ్యంలో భగవంత్ కేసరి మంచి బిజినెస్ చేసింది. ఏపీ/తెలంగాణాలలో భగవంత్ కేసరి రూ. 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 65 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు.

దసరా కానుకగా అక్టోబర్ 19న అనగా గురువారం భగవంత్ కేసరి విడుదలైంది. మూవీకి డీసెంట్ టాక్ దక్కింది. ఫస్ట్ డే భగవంత్ కేసవరి వసూళ్లు పరిశీలిస్తే… ఇండియా వైడ్ రూ. 14 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో భగవంత్ కేసరి మొదటి రోజు 67% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు సమాచారం. ఇది డీసెంట్ ఫిగర్ అని చెప్పాలి.

ఇక యూఎస్ ప్రీమియర్ వసూళ్లతో భగవంత్ కేసరి $506300 వసూళ్లు అందుకుంది. అంటే రూ. 4.21 కోట్ల వసూళ్లు రాబట్టింది. బ్యాక్ టు బ్యాక్ ప్రీమియర్స్ తో బాలయ్య హాఫ్ మిలియన్ వసూళ్ల రికార్డు నమోదు చేశాడు. ఏరియా వైజ్ వివరాలు అందాల్సి ఉంది. భగవంత్ కేసరి ఫస్ట్ డే వసూళ్ల పూర్తి సమాచారం అందాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ రీత్యా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సి ఉంది. రూ. 66 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాలయ్య బరిలో దిగాడు.