Bhagavanth Kesari Review : భగవంత్ కేసరి మూవీ ఫుల్ రివ్యూ

ఈ సినిమాలో బాలయ్య బాబు పేల్చిన డైలాగులు థియేటర్ లో బాంబుల్లా పేలాయి. అలాగే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలతో పోల్చితే బాలయ్య బాబు హావభావాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

Written By: Gopi, Updated On : October 19, 2023 8:17 am
Follow us on

Bhagavanth Kesari Review : సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఇప్పుడు కూడా వరుస విజయాలను అందుకోవడంలో చాలావరకు సక్సెస్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే ఇవాళ్ళ భగవంత్ కేసరి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమా విశేషాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కథలోకి వెళ్తే…

తెలంగాణ ప్రాంతంలోని నేలకొండపల్లి అనే ఊరుకు సంబంధించిన గిరిజన ప్రాంతంలో నివసించే భగవంత్ కేసరి ఆయన కూతురిని ఆర్మీకి పంపించాలి అనుకుంటాడు తన కూతురికి మాత్రం ఆర్మీ కి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు దాంతో ఆయన కూతుర్ని ఆర్మీ కి పంపించాడా లేదా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఇక తన కూతురి వల్ల భగవంత్ కేసరి కొంతమంది రాజకీయ నాయకులతో , అలాగే కొత్తమంది రౌడీలతో గొడవలు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఇంతకీ అతను కూతురు ఆర్మీకి వెళ్లిందా లేదా ఆ రౌదలను బాలయ్య ఎలా ఎదిరించాడు అనే కథాంశంతో చాలా ఆసక్తికరంగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి ఇక ఈ సినిమాకి సంభందించిన ఫుల్ స్టోరీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే…

ఇక ఈ సినిమా తో దర్శకుడు అనిల్ రావిపూడి చాలావరకు బాలయ్య బాబు ని కొత్త వే లో చూపించే ప్రయత్నం చేశారు.అలాగే ఇంతకుముందు అనిల్ రావిపూడి అంటే క్రింజ్ కామెడీ సినిమాలు మనకి గుర్తుకొచ్చేవి కానీ దీంట్లో అలాంటివి ఏమీ లేకుండా ఇంతవరకు ఆయన చేయని ఒక కొత్త పంథాలో ఈ సినిమాని తెరకెక్కించి బాలయ్య బాబు అభిమానులు ఆయన్ని ఎలాగైతే చూడాలి అని అనుకుంటున్నారో సరిగ్గా అదే వేలో బాలయ్య బాబును చూపించే ప్రయత్నం చేశాడు.అలాగే ఈ సినిమా లో కొన్ని సీన్స్ అయితే అద్బుతం గా తీశాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు యాక్టింగ్ కూడా వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు తో పాటు తన భార్యగా నటించిన కాజల్ అగర్వాల్ కూడా తన పాత్ర మేరకు బాగా నటించింది. ఇక బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీలా మాత్రం ఒక మంచి గుర్తుండిపోయే పాత్రలో సహజమైన నటనతో అందర్నీ ఆకట్టుకుందనే చెప్పాలి.

అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు పేల్చిన డైలాగులు థియేటర్ లో బాంబుల్లా పేలాయి. అలాగే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలతో పోల్చితే బాలయ్య బాబు హావభావాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లలో మాత్రం చాలా మంచి ఎలివేషన్స్ ఉన్నాయనే చెప్పాలి. ఇక దానికి తగ్గ బీజీయం అందించడం కూడా విశేషమనే చెప్పాలి…

అయితే బాలయ్య బాబుకి,శ్రీలీలా కి మధ్య వచ్చే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కొంతవరకు బాగా వర్కౌట్ అయ్యాయి. అయినప్పటికీ వాటిని బాగా తీసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఈ సినిమాని చాలా బాగా తీసినప్పటికీ ఈ సినిమా రొటీన్ స్టోరీ గా సాగుతుందనే చెప్పాలి. అలాగే దీంట్లో పెద్దగా తెలుసుకోవాల్సి కొత్త విషయాలు మాత్రం ఏమీ లేవు డైరెక్టర్ గా అనిల్ రావిపూడి కొత్త పంథా లో సినిమా తీసినప్పటికీ పెద్ద కొత్తదనం అయితే ఏమీ చూపించలేదు…ఇక ఈ సినిమా చేసిన అర్జున్ రామ్ పాల్ శరత్ కుమార్ పంటి నటుల నటన సినిమాకి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. ఇక రామ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కొన్ని సీన్ల ని తన వర్క్ ద్వారా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు…ఎడిటర్ తమ్మిరాజు గారి వర్క్ కూడా చాలా అద్బుతం గా ఉంది…

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే బాలయ్య బాబు యాక్టింగ్ , డైలాగ్స్, తమన్ బిజీఎం అనే చెప్పాలి.

ఇక మైనస్ విషయాలకు వస్తే రొటీన్ స్టోరీ కొన్ని సీన్లలో ఇంటిమాసి అనేది సెట్ అవ్వలేదు. దానివల్ల కొన్ని సీన్లు సెంటిమెంటల్ గా 100% వర్క్ అవుట్ అవ్వలేదు… ఇక వీటిని మినహాయిస్తే భగవంత్ కేసరి సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు దానివల్ల ఈ సినిమాని దసరాకి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు…

ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5