
IND vs AUS : టెస్టుల్లో నెంబర్ వన్ హోదాలో ఉండి అత్యంత అవమానకరమైన రీతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ ముందు తలవంచింది.. పైగా టాప్ _2 బాటర్లతో పాటు అగ్రస్థాయి బౌలర్ కూడా ఆస్ట్రేలియా చెంతే ఉన్నాడు.. ఇక స్పిన్ ను ఎదుర్కొనేందుకు అశ్విన్ డూప్ తో ఎన్ని వ్యూహాలు రచించినా చివరకు అసలైన అశ్విన్ (5/37) చేతిలోనే ఆస్ట్రేలియన్లు కంగారెత్తిపోయారు.. ఎంతలా అంటే తన పది ఓవర్లలో అతడు సగం జట్టును ఫెవిలియన్ చేర్చి ఇన్నింగ్స్ ఓటమిని కళ్ళ ముందు ఉంచాడు.. ఓవరాల్ గా ఒక్క సెషన్ లోనే ఆస్ట్రేలియా 10 వికెట్లు కోల్పోయి చిత్తుగా ఉండాల్సి వచ్చింది. ఇదంతా మ్యాచ్లో ఒక కోణం.. కానీ విదర్భలో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారి వాటి గురించి తెలుసుకుందాం.

మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను చావు దెబ్బ తీసిన రవీంద్ర జడేజా వేలికి ఆయింట్మెంట్ రాసుకొని ఐసీసీ ఆగ్రహానికి కారణమయ్యాడు.. పెనాల్టీ కట్టాడు.. విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ ని దాదాపు రన్ అవుట్ చేశాడు. తన తప్పిదం కాబట్టి రోహిత్ ని క్షమించమని కోరాడు. దీనికి రోహిత్ పరవాలేదు అన్నాడు.
గతంలో బౌలింగ్ చేసేందుకు చాలామంది భారత ఆటగాళ్లు ముందుకు వచ్చేవాళ్ళు కాదు.. దీంతో గత్యంతరం లేక భారత కెప్టెన్ ఫుల్ టైం బౌలర్లతోనే బౌలింగ్ వేయించేవాడు.. అదృష్టం బాగుంటే మ్యాచ్ మన సొంతం అయ్యేది. లేకుంటే ఓటమి ఖరారు అయ్యేది. కానీ విదర్భ మైదానం మీద నేనంటే నేను బౌలింగ్ వేస్తానని ఆటగాళ్లు ముందుకు రావడం గమనార్హం.. ఇదే విషయాన్ని రోహిత్ శర్మ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను మాట్లాడుతుంటే సహచర క్రికెటర్లు మొత్తం ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.
— Aditya Kukalyekar (@adikukalyekar) February 10, 2023
సాధారణంగా మ్యాచ్ లో ఆగ్రహాన్ని ఆపుకోలేని రోహిత్ శర్మ.. ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ ను పాగల్ అని సంబోధించాడు.. వాస్తవానికి ఇతర జట్ల ఆటగాళ్ళను స్లెడ్జింగ్ చేయడం ఆస్ట్రేలియన్లకు అలవాటు. కానీ ఈసారి ఆ పాత్ర టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పోషించాడు.
ఇక ఇండియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, త్వర త్వరగా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియన్ దిగ్గజ ఆటగాడు స్మిత్ మెచ్చుకున్నాడు.. దీంతో కడుపు మండిపోయిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్ ను తిట్టారు. ” ఆస్ట్రేలియన్ ఆటగాడివా లేక ఇండియన్ జట్టుకు ఇన్ ఫార్మర్ వా అంటూ” దెప్పి పొడిచారు.

ఆస్ట్రేలియా జట్టులో నాథన్ లయన్ దగ్గర శిష్యరికం చేసిన మర్ఫీ బౌలింగ్లో అనేక మెలకువలు నేర్చుకున్నాడు. బంతిని ఎలా మెలికలు తిప్పాలో తర్ఫీదు పొందాడు. కానీ మొదటి టెస్టులో తన గురువు వికెట్లు తీసేందుకు ఆపసోపాలు పడుతుంటే తాను మాత్రం ఇండియన్ బ్యాట్స్ మెన్ ను వణికించాడు. తొలి టెస్ట్ లోనే ఐదుకు మించి వికెట్లు తీసి ఔరా అనిపించాడు.. లేకపోతే ఇండియా స్కోర్ 500 దాటేది.. ముఖ్యంగా తేమ కోల్పోయిన మైదానంపై అతడు బంతి పై పట్టు సాధించి వికెట్లు తీయడం ఆస్ట్రేలియన్లకే కాదు, బ్యాటింగ్ చేస్తున్న ఇండియన్ ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది.. మర్ఫీ లేకుంటే తాము ఇంకా 100 పరుగులు ఎక్కువ చేసే వాళ్ళం అని రోహిత్ శర్మ అన్నాడు అంటే అతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

ఇక ఈ టెస్టులో సిక్సర్లతో వీర విహారం చేసిన మహమ్మద్ షమీ.. విరాట్, యువరాజ్ రికార్డులను బద్దలు కొట్టాడు. సాధారణంగా మహమ్మద్ షమీ బ్యాటింగ్ దూకుడుగా ఉంటుంది. చివర్లో వస్తాడు కాబట్టి అతడు బాదడానికే ప్రయారిటీ ఇస్తాడు. ఇక మర్ఫీ బౌలింగ్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తోటి ఆటగాళ్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో షమీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఇండియా 400 స్కోర్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.