Attacks on opposition : గత ఎన్నికల ముందు నుంచి ఏపీలో కనీవినీ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విష ప్రచారంతో పాటు సానుభూతి కోసం జరిగిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. వాటిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అయితే వీటి వెనుక రాజకీయ వ్యూహకర్తల ఐడియాలజీ ఉందని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ వ్యూహాకర్తలను నియమించుకుంది. ప్రజలను కులాలు, మతాలు, వర్గాలుగా విభజించి వైసీపీ వైపు మళ్లించడంలో వారు సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు విపక్షాలను ఎదుర్కొవడం, అణిచివేయడానికి సైతం వ్యూహాలు పన్నుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా విపక్ష నాయకులు, వారి కాన్వాయ్ లపై దాడులు వెనుక వ్యూహకర్తల వ్యూహాలు ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతోంది.

ఎన్నికల ముందు నుంచి అంతే..
వైసీపీకి గత ఎన్నికల ముందు నుంచి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా సేవలందించారు. ఇష్యూ రైజింగ్ చేయడం, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా స్ప్రెడ్ చేయడంలో పీకే టీమ్ సక్సెస్ అయ్యింది. వైసీపీకి అనుకూలంగా స్లోగన్స్, నవరత్నాల స్కీమ్స్, సోషల్ మీడియాలో ప్రచారం, ఎలక్షన్ క్యాంపెయినింగ్, పోల్ మేనేజ్ మెంట్ వంటివి చేయడంతో వైసీపీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ విజయాన్ని పదిలం చేసుకోవడానికి అదే వ్యూహకర్తలు అడ్డదారి దొక్కుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పీకే పక్కకు తప్పుకోగా రుషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ టీమ్ వైసీపీకి సేవలందిస్తోంది. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతున్న వేళ.. విపక్ష నాయకులను టార్గెట్ చేసుకొని వ్యూహాలు రూపొందిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
పక్కా వ్యూహంతో చంద్రబాబుపై దాడి..
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ ఘటన పక్కా వ్యూహంతో చేసిందేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ విపక్షాలపై వ్యతిరేకత, ప్రభుత్వంపై అనుకూతలు వచ్చేందుకు మాత్రమే ఐ ప్యాక్ టీమ్ పనిచేసేది. అయితే కొత్తగా ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై దాడులు, హత్యలు వంటి వాటికి కూడా ప్రణాళిక లు ఇస్తోందని దగ్గరుండి వాటిని ఎలా అమలు చేయాలో కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారన్న విషయం బయటపడింది. సౌమ్యంగా కనిపించే మంత్రి ఆదిమూలపు సురేష్ వీధి పోరాటానికి దిగడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో టీడీపీ వారు రాళ్లు విసరడంతో ముగ్గురు వైసీపీ నేతలకు గాయాలయ్యాయని మంత్రి సురేష్ ఆరోపిస్తున్నారు. ఇద్దరి పేర్లు చెబుతున్నారు కానీ మూడో పేరు చెప్పడం లేదు. ఆ మూడో వ్యక్తిఐ ప్యాక్ వ్యక్తి. అని అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. ఆయనకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ మూడో వ్యక్తి ఎవరు?
ఆ రోజు దాడి జరుగుతున్నప్పుడు సురేష్ కు ప్లాన్ వివరిస్తూ.. ఏం చెయాలో చెబుతూ కొన్ని వీడియోల్లో ఓ వ్యక్తి కనిపించారు. తర్వాత గాయపడి సురేష్ ఆఫీసులో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అతను ఐ ప్యాక్ ఉద్యోగి అని స్పష్టంగా తెలియడంతో ఇప్పుడు వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు. అదే సమయంలో టీడీపీ విమర్శల డోసు పెంచింది. టీడీపీ నాయకులకు అంతమొందించేదాకా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి పక్కా ప్లాన్ అని దీనిపై ఖచ్చితంగా విచారణ చేయించాలని కోరుతున్నారు. గవర్నర్ కు ఫిర్యాదుచేస్తామని చెబుతున్నారు. అటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సంస్థ అధికారులు ఇప్పిటికే ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో పోలీసులే కుట్రదారులుగా భావిస్తున్నట్టు సమాచారం. రహస్య దర్యాప్తునకు దిగినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే వ్యూహకర్తలు గెలుపు కోసం ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు.