
Attack on Owaisi’s House : ఢిల్లీలోని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై ఇటీవల హిందూ సేన కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. కానీ విశేషం ఏంటంటే.. దీనిపై ప్రతిపక్షాలు మౌనం దాల్చడం చర్చనీయాంశమయ్యాయి.. అసద్ విషయంలో ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదన్నది హాట్ టాపిక్ గా మారాయి.
ఇదే దాడి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్ పై జరిగితే దేశం మొత్తం గందరగోళంగా మారి ఉండేది. ఉద్రిక్తతలకు దారితీసేది. బీజేపీని ధీటుగా ఎదురిస్తూ నిలబడుతున్న ఒక ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం నేతపై దాడి జరిగితే మిగిలిన పక్షాలైన కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఎందుకు రాద్ధాంతం చేయలేదన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కారణం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది.
ప్రజాస్వామ్యం, భావస్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ అనేది రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ దాడిపై మౌనంగా ఉన్నారా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఓవైసీ రాజకీయాలు దేశహితమైనవి కావు.. రెచ్చగొట్టేలా ఉన్నాయి. ప్రజలకు ఆయన ప్రసంగాలు మంచివి కావు.. కానీ రాజకీయంగా ఓవైసీని ఏకం చేయాలి.. చట్టబద్ధంగా ఓవైసీపై చర్యలు తీసుకోవాలి. కానీ చట్టవ్యతిరేకంగా దాడి చేసే ఎవరికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజకీయాలు వేరు.. ప్రజాస్వామ్యం వేరు.. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అంతేకానీ వ్యక్తులపై దాడులు, హింసకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు. ఇప్పుడు ఓవైసీపై దాడి జరిగింది.. రేపు ఇంకో ప్రతిపక్ష నేతపై జరగొచ్చు. కానీ ఇలా దాడులు చేయడం తప్పు. ప్రతిదీ చట్టప్రకారం జరిగితేనే ప్రజాస్వామ్యం. ఓవైసీపై దాడి విషయంలో ఉదారవాదులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓవైసీపై దాడిని పార్టీలు ఖండించడం లేదు. ప్రతిపక్షాలు మౌనంగా ఉండడం నిజంగా తప్పు..
‘ఓవైసీ ఇంటిపై దాడి ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి?’ అనే అంశంపై ‘రామ్ టాక్’ స్పెషల్ ఫోకస్ వీడియో..
