Netherlands vs Argentina 2022: సాకర్ తొలి క్వార్టర్ మ్యాచ్ లో సంచలనం నమోదయి బ్రెజిల్ ఇంటికి వెళ్ళింది. రెండో క్వార్టర్ లో అటువంటిది ఏమీ లేకుండా అర్జెంటీనా దర్జాగా సెమిస్ లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్లో అనామక సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయిన అర్జెంటీనా.. ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా రివ్వున వెనక్కు దూసుకు వచ్చింది. జట్టు ముందుకు వెళ్లడం కష్టమని అని ఎగతాళి చేసిన వారి నోళ్లను మూయించింది.. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మెస్సీ జట్టు అద్భుతాలు చేస్తోంది. సౌదీ చేతిలో ఓటమి తర్వాత బలంగా పుంజుకుంది. నాకౌట్ పోరులో తన పాత ఆట తీరును బయటకు తీస్తూ ప్రత్యర్థి జట్లను తుత్తు నీయలు చేస్తోంది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్ పోటీలో నెదర్లాండ్ జట్టును పెనాల్టీ షూట్ అవుట్ లో చిత్తు చేసింది. రాయల్ గా సెమీసులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇలా సాగింది
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో మెస్సీ జట్టు 2_2(4_3) తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. చివర్లో అర్జెంటీనా గోల్ కీపర్ ఏమిలియానో మార్టినెజ్ పెనాల్టీ షూట్ అవుట్ లో హీరోగా నిలవడంతో అర్జెంటీనా 4_3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో లియోనల్ మెస్సీ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు..ఒక అసిస్ట్, గోల్ సహాయంతో అర్జెంటీ నాకు 2_0 ఆధిక్యాన్ని ఇచ్చాడు.. ఇక అర్జెంటీనా గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ ఆలస్యంగా మెరిసాడు. 83, 101 నిమిషాల్లో గోల్స్ చేసి నెదర్లాండ్స్ జట్టును రేసులో నిలిపాడు. ఇదే సమయంలో అర్జెంటీనా జట్టు డిఫెన్స్ కొంతమేర నెదర్లాండ్స్ జట్టుకు అనుకూలంగా పరిణమించింది. దీనిని వౌట్ తనకు అనుకూలంగా మార్చుకొని గోల్స్ సాధించాడు. దీంతో అదనపు సమయం అనివార్యమైంది.
పెనాల్టీ షూట్ అవుట్ ఇలా సాగింది
ఇరుజట్లు సమంగా గోల్స్ సాధించడంతో పెనాల్టీ షూట్ అవుట్ అనివార్యమైంది.. అదనపు సమయంలో రెండు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూట్ అవుట్ అనివార్యమైంది.. పెనాల్టీ షూట్ అవుట్ కూడా హోరా హోరీగా సాగింది. నెదర్లాండ్స్ ఆటగాడు వర్జిల్ వేసిన పెనాల్టీ గోల్ ను ఎమిలియానో ఆపాడు. ఆ తర్వాత మెస్సి గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం లోకి వెళ్ళింది.. తర్వాత నెదర్లాండ్స్ ప్రయత్నాన్ని ఎ మీలియానో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తర్వాత అర్జెంటీనా మరో గోల్ సాధించడంతో 2_0 ఆధిక్యాన్ని సంపాదించింది.. ఇక మూడో ప్రయత్నంలో గోల్ సాధించడంలో నెదర్లాండ్స్ సఫలమైంది.. ఇదే సమయంలో అర్జెంటినా మరో గోల్ సాధించి 3_1 ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ మరోసారి మ్యాజిక్ చేసి గోల్డ్ సాధించాడు. ఫలితంగా అర్జెంటినా ఆధిక్యం 3_2 కు తగ్గింది. అయితే నాలుగో ప్రయత్నంలో అర్జెంటీనా గోల్ చేయడంలో విఫలమైంది.. అయితే ఇదే సమయంలో నెదర్లాండ్స్ జట్టు మళ్లీ మ్యాజిక్ చేసి మళ్లీ గోల్ కొట్టింది దీంతో గోల్స్ సమం అయ్యాయి. అయితే మ్యాచ్ చివరిలో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మెరవడంతో డి జాంగ్ గోల్ చేయడంతో అర్జెంటీనా 4_3 తేడాతో సెమిస్ లోకి వెళ్లిపోయింది..

వారెవ్వా మెస్సీ
ఈ ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి నాలుగు గోల్స్ సాధించాడు.. కాగా తనకు ఇదే చివరి ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ అని మెస్సీ ఇదివరకే ప్రకటించాడు. అయితే తమను అతడు అలరిస్తాడని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. వారికి తగ్గట్టుగానే అతడు ఆడుతున్నాడు. ఇక మెగా కప్ న కు అర్జెంటీనా రెండు అడుగుల దూరంలో మాత్రమే నిలిచింది. ఇక మొదటి క్వార్టర్ పోటీలో బ్రెజిల్ జట్టును ఓడించి సెమీస్లోకి దూసుకెళ్లిన క్రోయేషియాతో అర్జెంటీనా జట్టు తలపడనుంది.