Pawan Kalyan Hari Hara Veera Mallu: ఇది వరకు పవన్ కళ్యాణ్ కేవలం ప్రాంతీయ భాష చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యాడు. కానీ ‘హరి హర వీరమల్లు’ సినిమా నుండి ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా భారీ బడ్జెట్ రేంజ్ సినిమాలే ఉండనున్నాయి.. వరుసపెట్టి సినిమాలు చేస్తూ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పొచ్చు..రెండు రంగాలను సమాంతరంగా బ్యాలన్స్ చెయ్యడం అంటే మాటలు కాదు.. మానసిక ఒత్తిడి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది.

కానీ పవన్ కళ్యాణ్ చాలా తేలికగా రెండిటినీ బ్యాలన్స్ చెయ్యడం చూసి విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఆయన నెల రోజుల నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇంటర్వెల్ కి సంబంధించిన పోరాట సన్నివేశం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వందమందితో ఫైట్ చేయనున్నాడు.. ఎరుపు రంగు వస్త్రాలలో గుబురు గెడ్డం తో పవర్ స్టార్ ఉన్న స్టిల్స్ ఈరోజు సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నానని, ఒరలో నుండి తీసిన కత్తిని పట్టుకున్న ఫోటో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చెయ్యగా నిమిషాల వ్యవధిలోనే వేలకొద్ది లైక్స్ , రీట్వీట్స్ వచ్చాయి.. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుతూ రావడం ఇన్ని రోజులు చూశాం.. కానీ మొదటిసారి ఆయన రాజకీయాల గురించి కాకుండా తన వ్యక్తిగత ఫోటోని..అది కూడా సినిమాకి సంబంధించినది పెట్టడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి పడనంత కష్టం పడుతున్నాడు.. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాకుండా.. ప్రతి షాట్ అద్భుతంగా వచ్చేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు.. అందుకోసం మూవీ టీం నిర్వహించే ప్రత్యేక వర్క్ షాప్స్ లో కూడా ఆయన పాల్గొంటున్నాడు.. ఇంత డెడికేషన్ ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి కూడా పెట్టలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరుకు కొనసాగే భారీ యాక్షన్ సన్నివేశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవ్వరు చూడని విధంగా ఉండబోతుందట.. ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా ఈ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా చేయబోతుందట.. వింటుంటే అర్జెంటుగా చూసేయాలి అనిపిస్తుంది కదూ..! కానీ సమ్మర్ వరకు వేచిచూడక తప్పదు.