Dil Raju- Balakrishna: సంక్రాంతికి థియేటర్స్ లభ్యత విషయంలో స్టార్ హీరోల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పడానికి తాజా సంఘటన నిదర్శనం. నందమూరి నటసింహం తన అసహనాన్ని నేరుగా దిల్ రాజు ముందు ప్రకటించారు. నువ్వు రాజు కాదు, అలాగే దిల్ కూడా లేదంటూ పరోక్షంగా నా సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదని అర్థమయ్యేలా చేశాడు. 2023 సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఆ నెక్స్ట్ డే 13న వాల్తేరు వీరయ్య థియేటర్స్ లో దిగుతుంది.

చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలతో పాటు విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు విడుదలకు సిద్ధం అవుతుంది. అధికారిక తేదీ ప్రకటించకున్నా వారసుడు సంక్రాంతికి విడుదల చేయడం అనివార్యం. ఒకేసారి పెద్ద హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు థియేటర్స్ సమస్య సాధారణం. అయితే న్యాయబద్దంగా థియేటర్స్ పంచుకోవాలి. అది ఓపెనింగ్స్ వరకే. తర్వాత రిజల్ట్ పై థియేటర్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రం థియేటర్స్ సక్సెస్ టాక్ తెచ్చుకున్న సినిమాకు దక్కుతాయి.
అలాగే స్టార్స్ చిత్రాలకు ఓపెనింగ్స్ చాలా ముఖ్యం. మారిన సమీకరణాల నేపథ్యంలో వీకెండ్ ముగిసే నాటికి మూవీ 70% రికవరీ చేయాలి. ఫస్ట్ వీక్ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలి. సినిమాలకు లాంగ్ రన్ ఉండటం లేదు. ప్రస్తుత సినిమా థియేట్రికల్ లైఫ్ రెండు మూడు వారాలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ మొత్తం తమ ఆధీనంలో పెట్టుకొని దిల్ రాజు శాసిస్తున్నాడు. ఈ క్రమంలో భారీ డిమాండ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు థియేటర్స్ తక్కువ కేటాయించి వారసుడు చిత్రానికి పెద్ద మొత్తంలో కేటాయించారనే ప్రచారం జరుగుతుంది.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు సగం వారసుడు చిత్రానికి సగం థియేటర్స్ దక్కాయట. వీలైనంత వరకు ఎక్కువ థియేటర్స్ పొందేలా చిరంజీవి, బాలకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. చేసేది లేక ఆ నలుగురు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ లను ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ మాఫియాకు దిల్ రాజు కింగ్ కాగా… బాలయ్య నవ్వుతూనే అతనికి చురకలు అంటించాడు. బాలయ్య-అనిల్ రావిపూడి మూవీ పూజా సెరిమోనికి హాజరైన దిల్ రాజుపై బాలయ్య వరుస సెటైర్స్ వేశారు. నీ పేరు రాజు కాదు కదా ఎందుకు అలా పిలుస్తారని దిల్ రాజును బాలయ్య అడగ్గా.. కుటుంబ సభ్యులు రాజు అని పిలిచేవారని, దిల్ సినిమాతో నిర్మాత కావడం వలన దిల్ రాజు అనే పేరు స్థిరపడిందని ఆయన చెప్పారు. అయితే నువ్వు రాజు కాదు… అలాగే నీకు దిల్ కూడా లేదని బాలయ్య ముఖాన అన్నారు. బాలయ్య టైమింగ్ సెటైర్ కి అందరూ పక్కున నవ్వేశారు. మనసు లేని నువ్వు మాకు థియేటర్స్ ఇవ్వడం లేదని బాలకృష్ణ ఇండైరెక్ట్ గా దిల్ రాజుకు చెప్పాడు.