
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రపంచామంతా ప్రస్తుతం ఆన్ లైన్ పైనే ఆధారపడుతోంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఖరీదైన వస్తువులు కావడంతో వీటిని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ల్యాప్ టాప్ ను కొనుగోలు చేసే వాళ్లు మొదట ఆ ల్యాప్ టాప్ ను ఎందుకోసం కొనుగోలు చేయాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి.
మన అవసరాలను బట్టి ల్యాప్ టాప్ బడ్జెట్, ఫీచర్లను ఎంచుకోవాలి. ఆ తరువాత మనకు ఏ సైజు ల్యాప్ టాప్ అవసరమో తక్కువ వెయిట్ లో కావాలో చూసుకోవాలి. మనం కొనుగోలు చేసే ల్యాప్ టాప్ కు ఎన్ని కనెక్టివిటీ పోర్టులు అవసరమో తెలుసుకొని మన అవసరాలకు తగినన్ని పోర్టులు ఉన్న ల్యాప్ టాప్ ను చూసుకోవాలి. మన అవసరాలకు తగిన ప్రాసెసర్ ను ఎంచుకోవాలి.
ర్యామ్, స్టోరేజ్ లాంటి విషయాలలో జాగ్రత్త వహించాలి. మన అవసరాలనుతగిన విధంగా ర్యామ్, స్టోరేజ్ ను ఎంపిక చేసుకోవాలి. బిల్డ్ క్వాలిటీ, డిస్ ప్లే లాంటి వాటిపై కూడా కనీస అవగాహన ఉండాలి. బ్యాక్ లైట్ ఉన్న ల్యాప్ టాప్ లను ఎక్కువగా ఎంచుకోవాలి. యూఎస్బీ టైప్ సీ పోర్టుతో పాటు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ల్యాప్ టాప్ ను ఎంచుకుంటే మంచిది.
ఏ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేస్తున్నామో ఆ ల్యాప్ టాప్ కు సంబంధించిన రివ్యూ చదివి ఆ ల్యాప్ టాప్ లోని మైనస్ ల వల్ల మనకు ఏ ఇబ్బంది ఉండదని భావిస్తే మాత్రమే ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలి. కొత్త ఫీచర్లు ఉన్న ల్యాప్ టాప్ ను ఎంచుకుంటే ఆ ల్యాప్ టాప్ ను ఎక్కువ కాలం వినియోగించవచ్చు.