వరదలతో ఇరు తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. చాలావరకు ప్రజలు కూడు, గూడు కోల్పోయారు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలూ కేంద్రం సాయం కోరారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా తమ రాష్ట్రానికి వరద సాయం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాడు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టం..ఇతర వివరాలను అందులో పేర్కొన్నారు.
Also Read: వరద సాయంలో ఏపీ, తెలంగాణ.. ఏది బెటర్?
ఎంత నష్టం జరిగింది.. ఎంత సాయం కావాలో కోరాడు. అయితే.. ఏ రాష్ట్ర సీఎం అయినా ప్రధానమంత్రిని అడ్రస్ చేస్తూ లేఖ రాస్తారు. కానీ.. ఏపీ సీఎం జగన్ మాత్రం హోంమంత్రి అమిత్ షాకు రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రాలకు సాయం చేసే అధికారం మాత్రం హోంమంత్రికి లేదు. సాయం కోసం పీఎంకు లేదా సంబంధిత శాఖ మంత్రికి రాస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ కనిపించడం లేదు. అన్నింటికీ అమిత్ షానే కనిపిస్తున్నారు. అసలు అమిత్ షా నిధులు ఎలా విడుదల చేస్తారు..? ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ అయింది.
జగన్ కేవలం అమిత్‌షాకే లేఖ రాయడం.. షాకే ప్రియారిటీ ఇస్తూ నిధులు కోరడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కూడా నిధుల విషయంలో అమిత్ షానే కోరుతుంటారు. పోలవరం నిధుల నుంచి వరద సాయం వరకూ అన్నింటినీ అమిత్ షానే అడిగారు. పోలవరం నిధులకు అమిత్ షాకు ఏంటి సంబంధం అని అధికారవర్గాలకు సహజంగానే అనుమానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి చెప్పాల్సినవన్నీ అమిత్ షాకు చెబుతున్నారు. అయితే జగన్ ఇచ్చిన ఇన్ని లేఖల్లో ఒక్కదానికీ రిప్లై కూడా లేదనేది వాస్తవం.
Also Read: ప్రజల్లో కరోనా భయం పోయిందా..?
ఓకే.. అమిత్ షా కేంద్రంలో నంబర్ టూ పొజిషన్. అంత మాత్రాన ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయాల్సిన అంశాలను నేరుగా అమిత్ షాకే వివరిస్తానంటే ఎలా..? అధికారికంగా లేఖలు కానీ.. కమ్యూనికేషన్ కానీ చేయాల్సింది ప్రధానితో కదా..! లేదా ఆయాశాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇవన్నీ జగన్‌కు తెలియదా..? లేక కావాలనే ఇలా చేస్తున్నాడా..? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్.