https://oktelugu.com/

AP Power Problem: ఏపీలో విద్యుత్ సమస్య పక్కదారి.. పరిష్కారం దొరికేదెన్నడూ?

AP Power Problem: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక ఆంధ్రా పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పరిపాలన అనుభవం లేని తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళుతుండగా.. రాజకీయ ఉద్దాండులు, మేధావులకు కేరాఫ్ అయిన ఏపీ మాత్రం వెనుకబడిపోతుంది. ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. కేవలం సంక్షేమంపైనే ఫోకస్ పెట్టడంతో ఏపీ అప్పులాంధ్రప్రదేశ్ గా మారింది. అప్పుచేసి పప్పు కూడు అన్నట్టుగా ఏపీ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం ఏం పని చేయాలన్నా అప్పు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2022 11:22 am
    Follow us on

    AP Power Problem: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక ఆంధ్రా పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పరిపాలన అనుభవం లేని తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళుతుండగా.. రాజకీయ ఉద్దాండులు, మేధావులకు కేరాఫ్ అయిన ఏపీ మాత్రం వెనుకబడిపోతుంది. ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. కేవలం సంక్షేమంపైనే ఫోకస్ పెట్టడంతో ఏపీ అప్పులాంధ్రప్రదేశ్ గా మారింది.

    AP power crisis

    అప్పుచేసి పప్పు కూడు అన్నట్టుగా ఏపీ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం ఏం పని చేయాలన్నా అప్పు మీదే ఆధారపడిపోతుంది. ఏరోజు కారోజు అప్పు ఎవరిస్తారా? ఎంత అప్పు చేద్దామా? అనే ఆలోచన తప్పా ఏపీలోని సహజ వనరులను ఏమాత్రం వినియోగించుకోలేక పోతుంది. ఏపీ స్వయం సంవృద్ధి సాధించకుండా ఎంతకాలం అప్పులపైనే ఆధారపడి కాలం వెళ్లదీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

    దీనికితోడు ఏపీలో కరెంటు సంక్షోభం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏపీలో విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. వేసవిలో కరెంట్ కు డిమాండ్ ఉంటుందని ప్రభుత్వానికి తెల్సినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ప్రభుత్వం తన చేతగానీ తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనధికారికంగా విద్యుత్ కోతలను విధిస్తోంది. అది కూడా గంటో రెండు గంటలు కాదే ఏకంగా పది నుంచి పన్నెండు గంటలు. పట్టణాల్లో కరెంట్ కోతల్లో కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ పల్లెలు మాత్రం అంధకారంలో మగ్గుతున్నాయి. దీంతో పల్లె జనాలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు.

    ఏపీలో విధిస్తున్న కరెంటు కోతలతో విద్యార్థులు, రైతులు, ఆస్పత్రుల్లోని రోగులు, వృద్ధులు, వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. బాలింతలు కరెంటు కోతలతో అవస్థలు పడుతుండగా చిన్నారులు ఉక్కపోతకు గుక్కపెట్టి ఏడిస్తున్నారు. విద్యార్థుల్లో రాత్రిళ్లు నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారు.

    వ్యాపారులు తమ వ్యాపారం చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు చేతికొచ్చిన పంట ఎండిపోతుండటంతో కరెంట్ ఆఫీసుల ఎదుట ధర్నాలకు దిగుతున్నాయి. విద్యుత్ పరిస్థితిపై సమీక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తోడు విద్యుత్ ఎక్సైంజ్ లో కరెంట్ కోనే పరిస్థితి ఏపీకి లేకుండా పోయింది.

    యూనిట్ కు 12రూపాయలు పెట్టి కొనే ఆర్థిక పరిస్థితి ఏపీకి లేదు. దీంతో ప్రభుత్వం ఏపీలో అసలు విద్యుత్ సమస్యే  లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ మంత్రవర్గ కూర్పుపై బేరీజు వేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో ఏపీలో విద్యుత్ సంక్షేమం మరికొన్ని రోజులు ఇలానే కొనసాగే అవకాశం కన్పిస్తోంది.