IPL 2022: ఐపీఎల్ సీజన్లో కి ఈసారి కొత్త జట్లు రెండు వచ్చాయి. ఇవి రావడం ఏంటో గానీ.. టాప్ జట్లకు శాపంగా మారిపోయాయి. గత సీజన్లలో బలమైన జట్లుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లకు వరుసగా షాక్ ఇస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాయి.

ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లల్లో మూడు వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేవలం ఓపెనర్ పృథ్వీ షా మాత్రమే ఆదుకున్నాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌కు లక్నో బౌలర్లు హడలెత్తిపోయారు. 34 బంతుల్లో రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 61 రన్స్ చేసి దుమ్ములేపాడు.
Also Read: One Chance: ఒక్క ఛాన్స్.. ఏపీని ‘అంధకారం’ దిశగా తీసుకెళుతుందా?
ఇక అతనితో పాటు బ్యాటింగ్‌కు వచ్చి తొలి మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 12 బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఐట్ అయిపోయాడు. ఇక వీరి తర్వాత వచ్చిన రౌమన్ పావెల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ పెద్దగా ఆదుకోలేకపోయారు. వీరిని కట్టడి చేయడంలో లక్నో బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ లాంటి వారు బ్యాటర్లకు ఏ మాత్రం పరుగులు ఇవ్వలేదు.
ఇక వీరి తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా చాలా కష్టపడింది. చివరి వరకు పోరాడి నెగ్గింది. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 155 పరుగుతో విజయాన్ని నమోదు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి విజయఢంకా మోగించింది. అయితే ఢిల్లీ ఓటమిని ఒక్కడే నిర్ణయించాడు. వాస్తవానికి బ్యాటింగ్ లో సూపర్ జెయింట్స్ కూడా బాగానే తడబడింది. చివరి ఓవర్ దాకా ఆడి లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది.

ఒక్క క్వింటన్ డికాక్ మాత్రమే సూపర్ జెయింట్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతను 52 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 80 రన్స్ చేసి కొరకరాని కొయ్యగా మారాడు. అతను ఒక్కడు ఆడకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేదనే చెప్పాలి. అయితే ఇలా కొత్తగా వచ్చిన సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ లాంటి బలమైన జట్లను ఓడించడం నిజంగా విశేషమనే చెప్పాలి.
Also Read:Maarisetty Raghavaiah: జనసేన వ్యూహకర్త మారిశెట్టి రాఘవయ్య బీజేపీ లో చేరిక!