Ap Politics : చంద్రబాబు అనుకున్నది చేయలేకపోయారా?

టీడీపీ, జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాపై ఎలాగూ టికెట్ ఆశించి రాని వారికి నిరాశ తప్పదు. కానీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొందరికి అవకాశం ఇస్తానని చెప్పి మరీ వారికి న్యాయం చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : February 24, 2024 4:06 pm

Chandrababu

Follow us on

Ap Politics :  ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం టీడీపీ, జనసేనలు కలిసి ఉమ్మడి జాబితాను ప్రకటించాయి. మొత్తం 175 స్థానాల్లో 94 టీడీపీ అభ్యర్థులు, 24 జనసేన అభ్యర్థులను ప్రకటించారు.. ఇందులో భాగంగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను జనసేన ప్రకటించింది. టీడీపీ, జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాపై ఎలాగూ టికెట్ ఆశించి రాని వారికి నిరాశ తప్పదు. కానీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొందరికి అవకాశం ఇస్తానని చెప్పి మరీ వారికి న్యాయం చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చంద్రబాబు చెప్పింది చేయలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగానే జనసేనతో కలిసి వెళ్తున్నామని బాబు ప్రకటించారు. అయితే ఏడాది నుంచి బాబు పలు పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ తప్పులు ఎత్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ అగ్ర వర్ణాలకే ప్రాధాన్యం ఇస్తోందని, బీసీలకు న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. కానీ టీడీపీ మాత్రం బీసీలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. కానీ శనివారం ప్రకటించిన జాబితాలో 84 మంది పెద కాపులే ఉండడం విశేషం.

వైసీపీ అధినేత జగన్ యువతకు అన్యాయం చేశాడని చంద్రబాబు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు యూత్ కే అవకాశం ఇస్తారని అన్నారు. దీంతో కొందరిలో ఆశలు రేకెత్తాయి. అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కు తుని టికెట్ కేటాయించారు. మిగతా ఎక్కడా యూత్ క్యాండెట్లు కేటాయించలేదు.. గెలిచే అవకాశం ఉన్న వారిని బాబు పక్కనబెట్టారన్న వాదన వినిపిస్తోంది.

పెద్దాపురం లాంటి నియోజకవర్గాల్లో మరోసారి పాత అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ప్రసంగాలు చేసిన బాబు జాబితా ప్రకటించే సమయానికి మనసు మార్చుకున్నారా? అని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు అవకాశం ఇచ్చారు. ఈయన వరుస పరాజయాలు పొందుతున్నా.. మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనే లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నామని బాబు చెప్పినప్పటికీ టికెట్ల కేటాయింపులో మాత్రం తీవ్ర అన్యాయం చేశారని కొందరు అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ కి టీడీపీ నుంచి పెద్దగా గట్టి పోటీ ఉండే అవకాశం లేదని కొందరు ఆ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకే కలిసి వస్తున్నాయని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.