Taneti Vanitha: ఆమె ప్రజల మాన.. ప్రాణాలను కాపాడిన పోలీస్ వ్యవస్థకు పెద్ద బాస్.. రాష్ట్రానికి హోంమంత్రి.. పైగా ఒక మహిళ నేత.. ఎంత బాధ్యతగా ఆమె వ్యాఖ్యలుండాలి.. కానీ ఆమె మాటలు ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నాయి. సాక్షాత్తూ ఏపీ హోంమంత్రియే ‘నిందితులు రేప్ చేయాలని చేయలేదన్నట్టు’ మాట్లాడడం పెనుదుమారం రేపుతున్నాయి. ఏపీ హోంమంత్రి బాధ్యతారాహిత్య ప్రకటనలు ఇప్పుడు పెనుదమారం రేపుతున్నాయి. చాలా వివాదాస్పదం అవుతున్నాయి.

-ఇంతకీ ఏపీ హోంమంత్రి అత్యాచారాలపై ఏమన్నారు?
ఏపీ నడిబొడ్డున రేపల్లె అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘అత్యాచారానికి పాల్పడిన వారు అసలు అమ్మాయిపై అత్యాచారం చేయాలని రాలేదట.. వాళ్లు తాగి ఉన్నారు. డబ్బుల కోసం భర్తపై దాడి చేశారు. భర్తను రక్షించుకోవడానికి ఆ అమ్మాయి వెళ్లినప్పుడు ఆమెను నెట్టేసే విధానం.. బంధించే విధానంలోనే అత్యాచారానికి గురైంది. పేదరికం వల్లనో, మానసిక పరిస్థితుల వల్లనో అప్పటికప్పుడు కొన్ని అనుకోని రీతిలో ఇలాంటివి జరుగుతుంటాయి’’ అని ఒక రాష్ట్రానికి హోంమంత్రి అయ్యిండి అత్యాచారాన్ని తక్కువగా చూపి.. నిందితుల తరుఫున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడడం పును దుమారం రేపుతోంది. నిందితులు అత్యాచారాన్ని కావాలని చేసింది కాదని..యాక్సిడెంటల్ గా చేసిందన్నట్టు హోంమంత్రి మాటలు ఉన్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
-హోంమంత్రి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఏపీలో అత్యాచారాల పరంపర ఆగడం లేదు. వారానికో రేప్.. 10 రోజులకో మర్డర్.. ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు కలకలం రేపుతున్నాయి. వరుస మర్డర్లు. గ్యాంగ్ రేప్ లతో మహిళల రక్షణ ఏపీలో కరువవుతోంది. ఎన్నడూ లేని విధంగా జరుగుతోన్న సీరియల్ అత్యాచారాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు గ్యాంగ్ రేపులు ఏపీలో పెను దుమారం రేపాయి. రేపల్లెలో మరో సామూహిక అత్యాచారం జరగడం ఆంధ్రాలో అలజడి రేపుతోంది. ఏకంగా రైల్వే స్టేషన్ లో గర్భిణీపై గ్యాంగ్ రేప్ జరగడంతో రేపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో ఏపీలో మరోసారి రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.ఏపీ నడిబొడ్డున.. సీఎం ఇంటికి కూత వేటు దూరంలో కూడా కృష్ణ నదీ తీరంలో ఓ రేప్ అప్పట్లో జరిగింది. అయినా ఇప్పటివరకూ చర్యలు లేవు. నిందితులపై కఠిన శిక్షలు లేవు. అందుకే ఏపీలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను చెరబడుతున్నారు. అదే ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా చేస్తోంది.
Also Read: RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్.. కానీ ఒక షరతు !
-చట్టాలెన్ని ఉన్నా.. నిందితుల్లో భయం లేదు.? పోలీసుల చర్యల్లేవ్?
దిశ చట్టం అంటూ.. మహిళా భద్రతకు పెద్ద పీట అంటున్నా కూడా ఏపీలో అత్యాచారాల పరంపర ఆగడం లేదు. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉంటున్నాయి. నిందితులు అస్సలు భయపడకుండా అత్యాచారాల పరంపర కొనసాగిస్తున్నారు. ఏపీలో నేరస్తులకు భయం లేకపోవడం.. పోలీసులు రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు చూసి నేరస్థుల విషయంలో సీరియస్ గా లేరని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని అలిగేషన్స్ వల్లే ఏపీలో పోలీసులు సరిగా పనిచేయడం లేదని.. అందుకే నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలున్నాయి. తెలంగాణలోలాగా నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే వారిలో భయం కనిపించి ఏపీలో ఇలాంటి నేరాలు తగ్గుతాయనే వారు లేకపోలేదు. కానీ ఏపీ పోలీసులు అలాంటి సీరియస్ యాక్షన్లు ఇప్పటిదాకా తీసుకోలేదు. దీంతో వైసీపీ సర్కార్ అసమర్థతపై విమర్శల వర్షం కురుస్తోంది.
-ఏపీ హోంమంత్రి తీరుపై విమర్శలు..
ఇప్పటికే అత్యాచారాలు.. మర్డర్లతో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత నాలుగురోజులుగా రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం ఘటన ఏపీని షేక్ చేస్తోంది. ఇలాంటి సమయంలో బాధితురాలిని ఆస్పత్రిలో ఉంచి ఎవరినీ కలవనీయకుండా కట్టడి చేస్తున్నారు. ఇక ఆస్పత్రికి వచ్చిన హోంమంత్రిని అడ్డుకున్న వారిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అరెస్ట్ లు చేశారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉంటే రేపిస్టులకు ఆ ఉద్దేశం లేదని.. ఇంకేదో చేయబోయి రేప్ చేశారని హోంమంత్రి అనడం దుమారం రేపుతోంది. దొంగతనానికి వచ్చి అడ్డుకున్న మహిళపై రేప్ చేశారని హోంమంత్రి అనడం ఆమె బాధ్యతారాహిత్యం అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ప్రకటన వల్ల ప్రజలకు హోంమంత్రి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Acharya 5 Days Collection: 5 రోజుకే పాతిక లక్షలకు పడిపోయిన ఆచార్య !