Chiranjeevi- Sridevi Remuneration: శ్రీదేవి 20 అడిగితే.. చిరంజీవి మరో 15 ఎక్కువ అడిగారు

Chiranjeevi- Sridevi Remuneration: మెగాస్టార్ చిరంజీవి శ్రమజీవి. సినిమా కోసం శ్రామికుడిలా పని చేస్తారు. ఆయనకు నిర్ణీత సమయం ఉండదు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్లోజప్ షాట్స్‌లో నటిస్తారు తప్పితే.. షూటింగ్ మానుకోరు. అందుకే.. చిరు అంటే.. ఒక గౌరవం ఉంది అందరికీ. నిజానికి వేరే హీరో అయితే షూట్ గ్యాప్ లో రేస్ట్ తీసుకుంటారు. కానీ చిరు మాత్రం అలా చేసేవారు కాదు. […]

Written By: Shiva, Updated On : May 4, 2022 5:23 pm
Follow us on

Chiranjeevi- Sridevi Remuneration: మెగాస్టార్ చిరంజీవి శ్రమజీవి. సినిమా కోసం శ్రామికుడిలా పని చేస్తారు. ఆయనకు నిర్ణీత సమయం ఉండదు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్లోజప్ షాట్స్‌లో నటిస్తారు తప్పితే.. షూటింగ్ మానుకోరు. అందుకే.. చిరు అంటే.. ఒక గౌరవం ఉంది అందరికీ. నిజానికి వేరే హీరో అయితే షూట్ గ్యాప్ లో రేస్ట్ తీసుకుంటారు. కానీ చిరు మాత్రం అలా చేసేవారు కాదు.

Chiranjeevi- Sridevi

అందుకే మెగాస్టార్ చిరంజీవితో ‘మీరు సినీ కళాకారులు కాదు… సినీ కళా కార్మికులు’ అని నటుడు రావుగోపాల్ రావు అనేవారని చిరు రీసెంట్ గా గుర్తు చేసుకున్నారు. అంత కష్టపడి పైకి ఎదిగిన చిరుకి డబ్బు విలువ బాగా తెలుసు. పైగా బాక్సాఫీస్ వద్ద చిరు తన స‌త్తా ఏమిటో ఫ్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఐతే.. చిరు హీరోగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విషయంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

Also Read: Taapsee Pannu: తన ఫిజిక్ సీక్రెట్ చెప్పేసిన తాప్సీ పన్ను

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం శ్రీదేవి భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. అయినా సరే.. ఆమె అడిగినంత ఇచ్చి మరి ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. మరి ఈ సినిమాలో న‌టించినందుకు చిరంజీవి ఎంత డిమాండ్ చేశారు ?

jagadeka veerudu athiloka sundari movie

మీకు తెలుసా? మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటించడానికి రూ. 35 ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. శ్రీదేవి కంటే ఆయన 15 లక్షలు ఎక్కువ అడిగి తీసుకున్నారు. అప్ప‌ట్లో ఇది చాలా ఎక్కువ‌. నిజానికి శ్రీదేవికి ఇచ్చిన . 20 ల‌క్ష‌లు కూడా చాలా ఎక్కువే. మూడున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ఈ రెమ్యున‌రేష‌న్ ఇప్ప‌టి లెక్క‌ల్లో లెక్కలేసుకుని చూస్తే కోట్ల‌లోనే ఉంటుంది.

ఇక ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావుతో పాటు జంధ్యాల‌ స్క్రీన్ ప్లే అందించారు. జంధ్యాల‌ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అందుకే బుల్లితెరపై ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Also Read:NTR- SS Rajamouli: ఎన్టీఆర్‌ ను హీరోగా రాజ‌మౌళి ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదు ?

Tags