Anti-Indian Kashmiri terrorists : విశ్వగురువుగా కీర్తి ఘడిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కొట్టిన దెబ్బకు దాయాది దేశం పాకిస్తాన్ అబ్బా అంటోంది. గతంలో భారత్ నుంచి అందిన సహకారంతో రెచ్చిపోయిన పాక్‌ను ఇప్పుడు అడుక్కుతినే స్థాయికి దిగజారింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత దేశ నాశనాన్ని కోరుకున్న దాయాది దేశం ఇక ఎప్పుడూ యుద్ధం చేయం బాబూ మమ్మల్ని ఆదుకోండి అని వేడుకుంటోంది. ఈ పరిస్థితికి కారణం ప్రధాని మోదీ సంకల్పం..
కుక్కతోక వంకర అన్న చందంగా పాక్ తన వక్రబుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు. భారత్‌లోని కొన్ని శక్తుల నుంచి అందుతున్న సహకారంతో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. 2016లో భారత్‌పై ఉగ్రదాడికి కారణమైంది. ఇప్పటికీ కొనసాగిస్తోంది.
తాజాగా కశ్మీర్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఈ క్రమంలోనే కశ్మీర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో వరుసగా హత్యకు గురికావడం సంచలనమైంది. ఈ హత్యలు చర్చనీయాంశమయ్యాయి. మోడీసర్కార్ ఈ పని చేస్తోందా? ఉగ్రవాదులను ఏరివేస్తున్న మోడీ సర్కార్ చర్యలు పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
పాకిస్తాన్ లో తలదాచుకున్న కశ్మీర్ ఉగ్రవాదుల హతం వెనుక ఉన్న సంచలన నిజాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..
