https://oktelugu.com/

Preeti’s Death : షాకింగ్ ట్విస్ట్ : ప్రభుత్వ 50 లక్షల బాండ్ నే ప్రీతి చనిపోవడానికి కారణమా?

Preeti’s death వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చివరకు ప్రాణాలే కోల్పోయింది. దీంతో అన్ని ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఆమె మృతిపై న్యాయ విచారణ చేసి నిందితుడు సైఫ్ కు ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రీతి మరణానికి కారకుడైన సైఫ్ పై కఠినమైన కేసులు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 28, 2023 10:33 pm
    Follow us on

    Preeti’s death వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చివరకు ప్రాణాలే కోల్పోయింది. దీంతో అన్ని ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఆమె మృతిపై న్యాయ విచారణ చేసి నిందితుడు సైఫ్ కు ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రీతి మరణానికి కారకుడైన సైఫ్ పై కఠినమైన కేసులు నమోదు చేయాలనే ఆందోళన పెరుగుతోంది.

    వైద్య విద్యలో సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ కోసం రూ. 50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తరువాత ఏవైనా కారణాలతో కోర్సు మధ్యలో డ్రాప్ అయితే యూనివర్సిటీకి డబ్బు చెల్లించాలి. ప్రీతి విషయంలో ఇదే శాపంగా మారిందని తెలుస్తోంది. గత ఏడాది వరకు మెడికల్ సీటు వదిలేస్తే రూ.20 లక్షలు కట్టాలనే నిబంధన ఉండేది. దాన్ని ఈ ఏడాది రూ.50 లక్షలకు పెంచడంతో ప్రీతి కాలేజీ వదిలేందుకు ధైర్యం చేయలేదు. లేకపోతే సీనియర్లు చేసే ర్యాగింగుకు ఎప్పుడో వెళ్లేది.

    కళాశాలలో ర్యాగింగ్ వెర్రితలలు వేస్తుండటంతో ప్రీతి జీర్ణించుకోలేకపోయింది. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాలేజీ వదిలేయొద్దనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్లింది. తండ్రి కూడా ప్రీతి చదువుపై ప్రోత్సహించాడు. రూ. 50 లక్షలు కట్టడమెలా అనే ఉద్దేశంతోనే ఆమె కళాశాలలోనే ఉండిపోయింది. అంత మొత్తంలో డబ్బు ఎలా తెస్తామని వేదనకు గురైంది. మధ్యలో కాలేజీ వదిలేస్తే డబ్బులు కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఎన్నో కష్టాలను భరించింది. చివరకు తనువు చాలించాలనే నిర్ణయానికి రావడం బాధాకరం.

    రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ బాండ్ పేరుతో నిబంధన తీసుకురావడం ఆమె పాలిట శత్రువులా మారింది. విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా పాలకులు మాత్రం వినిపించుకోవడం లేదు. ఫలితంగా ప్రీతి మరణం సంభవించింది. దీనికి ఎవరు కారకులు? ఆ తల్లిదండ్రుల శోకం ఎవరు తీరుస్తారు? వైద్య విద్యనభ్యసించేది భవిష్యత్ పై భరోసాతోనే కానీ ఇలా మధ్యలో ప్రాణాలు కోల్పోయేంత వరకు ఉదాసీనంగా వ్యవహరించడంపై దుమారమే రేగుతోంది. దీనిపై ఎన్ని చెప్పినా వారి మనోవేదన మాత్రం తీరదు. కన్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లే వరకు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం విమర్శలకు గురి చేస్తోంది.