KCR vs ABN RK : కెసిఆర్ జాకెట్స్ ఇవ్వడం లేదు.. ఆర్కే గోకుతూనే ఉంటాడు

ఇవన్నీ చూసయినా కేసీఆర్ సంధికి ఒకే అంటాడని ఆర్కే నమ్మకమా? లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత వంతపడే ప్రయత్నమా? మరి ఈ వ్యవహారాలపై కేసీఆర్ అలా చూస్తూ ఉండిపోతాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Written By: Bhaskar, Updated On : September 25, 2023 9:38 pm

kcr abn radhakrishna

Follow us on

KCR vs ABN RK : కోపాలు, తాపాలు, అలకలు, పాన్పులు.. ఇవి కేవలం భార్యాభర్తల మధ్యే ఉండవు. బావాబామ్మర్దుల మధ్య కూడా ఇలాంటి చిలిపి తగాదాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ రాధాకృష్ణ మధ్య ఇలాంటివి కొనసాగుతున్నాయి. గతంలో వారి మధ్య ఇలాంటివి చోటు చేసుకున్నప్పటికీ అనతి కాలంలోనే అవి సమసి పోయాయి. కానీ కొంతకాలంగా చోటుచేసుకున్న ఈగోలు ఇద్దరి మధ్య చల్లారడం లేదు. ఫలితంగా కెసిఆర్ ఆర్కే కు జాకెట్స్ (ఫుల్ పేజీ యాడ్స్) ఇవ్వడం లేదు. దీంతో సహజంగానే ఆర్కే కు ఎక్కడో మండుతోంది. పైకి విలువలు, వంకాయలు అని ఎన్ని కాకరకాయ కబుర్లు చెప్పినా యాడ్స్ లేనిది పేపర్ రన్ చేయడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత సులభం కాదు. తన మీద అంత ఎగిరి ఎగిరి పడుతున్నాడు కాబట్టే రాధాకృష్ణ ఆర్థిక మూలాలను కొంచెం గెలకాలని కెసిఆర్.. ప్రభుత్వం తాలూకు ప్రకటనలు ఇవ్వడం లేదు. కెసిఆర్ ప్రకటనలు ఇవ్వకపోయినా ఏం కాదని ఆర్కే కూడా గల్లా( బాబు, రేవంత్ సపోర్ట్ ఉందని సమాచారం.) ఎగరేస్తున్నాడు.

అంతటితో ఆగకుండా కెసిఆర్ ను గెలుకుతూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ప్రతిపక్షానికి మించి రాధాకృష్ణ తన పాత్ర పోషిస్తున్నాడు. ఇదే సమయంలో చంద్రబాబు విషయానికి వచ్చేసరికి పచ్చ డప్పు బీభత్సంగా కొడుతున్నాడు. అతడి లైన్ అటువంటిది కాబట్టి.. దానికి మనం ఏమీ చేయలేం. కెసిఆర్ కోపం నషాళానికి అంటే విధంగా ఆర్కే వ్యవరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత పాత్ర పై ముందుగానే వార్తలు రాసి అందరిని ఆశ్చర్యపరిచిన ఆర్కే.. ఈరోజు కూడా మిగతా పత్రికల కంటే తన పత్రికలో కవిత అరెస్టు ఖాయం అంటూ రాసేశాడు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిన నేపథ్యంలో.. బిజెపి పెద్దల ముందు కెసిఆర్ తలవంచాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్త రాయడం ఒకరకంగా సాహసం అనే చెప్పాలి. అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి సుద్దపూస అని కాదు. కెసిఆర్ తో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, తన గురువు చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ నోరు మెదపడం లేదు కాబట్టి, జగన్ కు 2019 ఎన్నికల్లో కేసీఆర్ సహాయం చేశాడు కాబట్టి.. సహజంగానే ఇవన్నీ తనకు వ్యతిరేకం కాబట్టి.. రాధాకృష్ణ ఈ స్థాయిలో రాస్తున్నాడు.

రాధాకృష్ణ రాసినట్టు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు జరుగుతుందా? లేకుంటే మళ్ళీ చప్పబడిపోతుందా? అనే ప్రశ్నలు పక్కన పెడితే కెసిఆర్ ను రేవంత్ రెడ్డి కంటే, కిషన్ రెడ్డి కంటే రాధాకృష్ణ ఎక్కువ గోకుతున్నాడు. ఇటీవలే కొన్ని గుల, కుల పత్రికలు కెసిఆర్ ఆరోపించిన నేపథ్యంలో.. రాధాకృష్ణ మరింత రెచ్చిపోతున్నాడు. అంటే తన పత్రికకు కులం, గుల రెండూ ఉన్నాయని రాధాకృష్ణ ఒప్పుకున్నట్టేనా.. ఇప్పటికే ధాన్యం టెండర్ల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన రాధాకృష్ణ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ ఎన్నికల ముందు కేసీఆర్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ చూసయినా కేసీఆర్ సంధికి ఒకే అంటాడని ఆర్కే నమ్మకమా? లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత వంతపడే ప్రయత్నమా? మరి ఈ వ్యవహారాలపై కేసీఆర్ అలా చూస్తూ ఉండిపోతాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.