Brahmani – ABN RK : “లోకేష్ నూ జగన్ విడిచిపెట్టేలా లేడు. అతడిని కూడా అరెస్ట్ చేస్తాడు. ఇప్పట్లో చంద్రబాబు నాయుడు ని బయటికి రానివ్వడు. ఎంతమంది లాయర్లు వచ్చినా జగన్ ముక్కుసూటిగానే వెళ్తున్నాడు. సో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక ఆశాదీపం బ్రాహ్మణి. కచ్చితంగా ఆమెను రంగంలోకి దింపుతారు” ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిన తీరు. సరే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గాని.. బ్రాహ్మణి హెరిటేజ్ మీద పెడుతున్న శ్రద్ధ రాజకీయాల్లో పెడితే తప్పకుండా విజయవంతం అవుతుంది. మాట తీరు లోకేష్ తో పోల్చితే చాలా స్పష్టంగా ఉంది. తన భావాలను కచ్చితంగా వ్యక్తికరించగలిగే సత్తా ఆమెకు ఉంది. బలమైన కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి.. ఆమెకు అది కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే మొన్న చంద్రబాబు కూర్చవలసిన కుర్చీలో బాలయ్య కూర్చొని పార్టీ శ్రేణులకు చేసిన ఉద్బోధ అదే కోవలోనిదని టిడిపి అంతర్గత సంభాషణలో వినిపిస్తోంది.
ఇవాళ బ్రాహ్మణి పేరుతో తాటికాయంత అక్షరాలతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వార్త అచ్చు వేసిన తర్వాత.. ఒక సందేహం మదిలో మెదులుతోంది. రాధాకృష్ణకు బాలయ్య అంటే అసలు గిట్టదు. ఇదేంటని ఎవరైనా అడిగితే బాలయ్యకు ఎబిలిటీ లేదని రాధాకృష్ణ సమాధానం ఇస్తాడు. తన మాటలు వెనక్కి తిరిగి వింటే తనకే అర్థం కావు. ఆయన ఆయనే బాగుంటే చంద్రబాబుకు టిడిపి పగ్గాలు ఎలా దక్కుతాయి అనేది రాధాకృష్ణ భావనగా ఉండి ఉంటుంది. రాధాకృష్ణ చెప్పినట్టు బ్రాహ్మణి ప్రస్తుతం టిడిపికి అవసరం అనుకుందాం.. అయితే మొన్నటిదాకా అందరూ అనుకున్నది ఏమిటి? జగన్ కు ఇక బెయిల్ రద్దయి మళ్ళీ జైలుకు వెళ్తే ఎవరు ఆపద్ధర్మ సీఎం? అపద్దర్మ సీఎం వంటి చాన్స్ ఏమీ ఉండదు. సీఎమ్మే.. భారతి సీఎం పగ్గాలు తీసుకుంటుందని రాసిన ఆంధ్రజ్యోతి.. మరి విజయమ్మ మాట ఏమిటో.. అసలు ఈ కోణంలో షర్మిల కూ, జగన్ కూ పడటం లేదని కూడా రాసి పడేసింది.
ఇప్పుడు ఆంధ్రను పక్కనపెట్టి కొద్దిసేపు తెలంగాణకు వద్దాం. సపోజ్ కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లిపోయి చక్రాలు తిప్పే పని చేపడితే ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి. మరీ కాదంటే కవిత.. ఆమె కూడా కాదంటే హరీష్.. అతడూ లెక్కలోకి లేడు అంటే సంతోష్. వీరంతా కాదు అవసరమైతే హిమాంశు.. వీళ్లను దాటి మిగతా వారెవరికీ ఆ అవకాశం లేదు. కుటుంబ పార్టీల సంప్రదాయం ప్రకారం అలానే ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఏమైనా అయితే.. ఆ సనాతన ధర్మాన్ని ఖండఖండాలుగా ఖండించే ఉదయనిధి సీఎం. ఒకవేళ ఏమైనా లెక్కలు తేడా వచ్చి ఉన్నప్పటికీ చివరికి ఆ కనిమొళిని కూడా ముఖ్యమంత్రి కానివ్వరు.
మనకు పొరుగున ఉన్న కర్ణాటకలో దేవి గౌడ తర్వాత కుమారస్వామి.. ఇక మహారాష్ట్రకు వెళితే పవార్ కు ఏమైనా అయితే తప్పకుండా సుప్రియ నే వారసురాలు అవుతుంది. అజిత్ పవార్ ను పొరపాటున కూడా దగ్గరికి రానివ్వరు. థాక్రే తర్వాత ఉద్ధవ్.. అతనికి ఏమైనా అయితే ఆదిత్య రెడీగా ఉన్నాడు. ఇక్కడిదాకా ఎందుకు నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్.. వాళ్ళవే కాంగ్రెస్ పగ్గాలు. ఒకవేళ రాహుల్ కాడి కింద పడేస్తే ప్రియాంక కొడుకు రెహాన్ రెడీ కావాల్సిందే. కర్ణాటక నుంచి కాశ్మీర్ దాకా వెళ్తే ప్రతి చోట ఇదే తంతు.. బీహార్ ఆర్ జె డి, ఉత్తర ప్రదేశ్ ఎస్పీ, ఎన్సీ, పీడీపీ, లెఫ్ట్, రైట్.. జాతీయ పార్టీలు మినహా.. ఇక ప్రాంతీయ పార్టీలు మొత్తం కుటుంబ పార్టీలే. ఆ కుటుంబం చేతిలోనే ఆయా పార్టీల పగ్గాలు, పదవులు, పార్టీల ఆస్తులు, కార్యకర్తల సంపద కూడా. ఒకవేళ మేమే జెండాలకు ఓనర్లమంటే కచ్చితంగా ఈటెల రాజేందర్ ను బయటికి పంపినట్టు పంపిస్తారు. వేరే వాళ్లను రానివ్వరు. సెకండ్ క్యాడర్ ను ఎదగనివ్వరు. తెలంగాణలో ఇప్పటికే అనేకచోట్ల ప్రజాప్రతినిధుల వారసులు రెడీ అయిపోయారు. రెబల్స్ గా మారి, పార్టీలు జంప్ అయి బరిలో ఉంటారట.
సో ఇలాంటి ట్రెండ్ ప్రతి చోట ఉంది. ఈ లెక్క ప్రకారం బ్రాహ్మణి అర్హురాలు.. టిడిపి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె మాత్రమే అర్హురాలు. కనుచూపు మేర ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నప్పటికీ వారిని కానివ్వరు. చివరిగా చెప్పాలంటే రాజకీయ ఏమైనా అయితే రాచకుమారుడు.. లేదా రాచ కుమార్తె.. ఒకవేళ పెళ్లయితే అల్లుడు మరీ కాదంటే మనుమడు లేదంటే మనవరాలు.. ఎవరు అన్నది రాచరికాలు పోయాయని.. రాజ్యాంగం నడుస్తున్న కాలంలోనూ ఈ కాలంలోనూ పార్టీల్లో నిక్షేపంగా రాచరికలు కొనసాగుతున్నాయి మరీ..
Bhaskar is a senior Journalist covers articles on Politics, General and entertainemnt news.
Read More