Viral Photo : ఈ కుర్రాడి తండ్రి చిత్ర పరిశ్రమలో నటుడిగా అడుగుపెట్టాడు. అనంతరం నిర్మాతగా మారాడు. దర్శకత్వం కూడా చేశాడు. బాల్యంలోనే కుమారుడిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఆయన కొడుకు యుక్త వయసుకు వచ్చాక, హీరోగా మారి స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇంతకీ కుర్రాడు ఎవరో ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉంటుంది. శ్రీదేవితో ఉన్న ఆ కుర్రాడు ఎవరో కాదు హృతిక్ రోషన్. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవితో ఒక చిత్రం చేశాడు. ఆ సినిమాలో స్టిల్ అది.
హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్. ఆయన బాలీవుడ్ లో నటుడిగా అరంగేట్రం చేశారు. అనేక చిత్రాల్లో నటించారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. తన కుమారుడు హృతిక్ రోషన్ ని 1980లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఆషా మూవీలో హృతిక్ రోషన్ ఒక పాటలో అలా తళుక్కున మెరుస్తాడు. వరుసగా మరో నాలుగు చిత్రాల్లో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. వాటిలో భగవాన్ దాదా ఒక చిత్రం. ఈ మూవీలో సౌత్ స్టార్స్ రజినీకాంత్, శ్రీదేవి జంటగా నటించారు. ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాకేష్ రోషన్ సైతం ఓ కీలక రోల్ చేశారు.
హృతిక్ రోషన్ పాత్రకు కూడా వెయిట్ ఉంటుంది. భగవాన్ దాదా మూవీలోని శ్రీదేవి-హృతిక్ రోషన్ స్టీల్ వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ అప్పటికి టీనేజ్ కుర్రాడు. ఈ తర్వాత హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. సల్మాన్-షారుఖ్ ఖాన్ ల మల్టీస్టారర్ కరణ్-అర్జున్ సినిమాకు హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే షారుఖ్ ఖాన్ నటించిన కోయ్లా చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక 2000లో కోయి మిల్ గయా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
కోయి మిల్ గయా చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకుడు కావడం విశేషం. హృతిక్ రోషన్ కి జంటగా అమీషా పటేల్ నటించింది. చూడటానికి గ్రీక్ గాడ్ లా ఉండే హృతిక్ రోషన్ అమ్మాయిల కలల రాకుమారుడు. అందానికి ఆయన్ని చిరునామాగా చెప్పుకుంటారు. హృతిక్ రోషన్ క్రిష్ సిరీస్ తో ఇండియన్ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్రిష్ సిరీస్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది
Web Title: This boy with sridevi is an indian superstar viral photo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com