SS Thaman : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మొదలు పెట్టారు. ఆన్లైన్ ట్రాకింగ్ ప్రకారం రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవలే అనంతపురం లో భారీ గా ప్లాన్ చేసారు మేకర్స్. కానీ తిరుపతి లో జరిగిన తొక్కిసిలాట ఘటన కి సానుభూతి తెలుపుతూ ఆ ఈవెంట్ ని రద్దు చేసారు. నేడు హైదరాబాద్ లో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈ ఈవెంట్ ని కానిచ్చేశారు. ఈ ఈవెంట్ లో తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘డాకు మహారాజ్ చిత్రం నేను ఇప్పటి వరకు పని చేసిన సినిమాలలో ఒక బెస్ట్ మూవీ అవుతుంది అని చెప్పగలను. బాలయ్య మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఆయన ఎనర్జీ ని మ్యాచ్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి నాకు పెద్ద ఛాలెంజ్ అనిపించింది. కచ్చితంగా అభిమానులు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు. డైరెక్టర్ బాబీ కెరీర్ బెస్ట్ చిత్రమిది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తమన్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ ఇస్తుండగా, ఆయన ఫ్రీక్వెన్సీ ని మ్యాచ్ చేయలేక స్పీకర్లు క్రిందకి పడిపోయాయి. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే గమనించి ఆ స్పీకర్లను మళ్ళీ యధాస్థానం లో పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
గతంలో తమన్ సంగీత దర్శకత్వం వహించిన ‘అఖండ’, ‘స్కంద’ వంటి చిత్రాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి స్పీకర్లు కాలిపోయి థియేటర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. వీటిని చూసి అభిమానులు, ప్రేక్షకులు అప్పట్లో ఆశ్చర్యానికి గురి అయ్యారు. థియేటర్ బయట సౌండ్ ఫ్రీక్వెన్సీ మేము చెప్పిన విధంగా లేకపోతే సినిమాని ప్రదర్శించము అంటూ నార్త్ అమెరికా లో సినీ మార్క్ చైన్స్ లో నోటీసు బోర్డు ద్వారా తెలిపారు. అంతటి విద్వంసం సృష్టించిన తమన్, ఇప్పుడు మళ్ళీ ‘డాకు మహారాజ్’ తో అదే రేంజ్ విద్వంసం సృష్టించబోతున్నాడు అని ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ చిన్న సంఘటన ని ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఇకపోతే రీసెంట్ గా విడుదల చేసిన రీ రిలీజ్ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.