Anant Ambani Radhika merchant : పెళ్లి తర్వాత నా పని ఇంకా ఈజీ

ఈ సందర్భంగా టార్జా అనే ఏనుగు స్టోరీని కూడా ఆమె నెటిజన్ల తో పంచుకుంది.. ఆ ఏనుగును కాపాడిన వంతారా బృందాన్ని ఆమె అభినందించింది. ఇన్ స్టా లో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

Written By: NARESH, Updated On : February 27, 2024 11:05 pm
Follow us on

Anant Ambani Radhika merchant Pre wedding celebrations: ముందస్తు పెళ్లి వేడుకలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పై మీడియా ఫోకస్ మరింత ఎక్కువవుతోంది. అతడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ మరింత ఎక్కువ చేసి చూపిస్తోంది. అయితే మీడియా అతి నచ్చకపోవడం వల్లో, మరేమిటో తెలియదు గానీ అనంత్ అంబానీ నేరుగా విలేకరుల ఎదుటకే వచ్చాడు. తనకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను ప్రకటించాడు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంతారా జంతు సంరక్షణ కేంద్రాన్ని, దానికి దారి తీసిన పరిస్థితులను అనంత్ అంబానీ విలేకరులతో పంచుకున్నాడు. ” జామ్ నగర్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పక్కనే 600 ఎకరాల్లో ఒక అడవిని సృష్టించాం. చుట్టూ సౌర విద్యుత్ సహాయంతో నడిచే కంచె నిర్మించాం. సౌర దీపాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ కేంద్రంలో జంతువులను సంరక్షించడమే మా బాధ్యత. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. వారు అడవి జంతువులను కాపాడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నాకు జంతువులను కాపాడడం అంటే ఇష్టం. అదే వంతారాకు నాంది పలికింది.” అని అనంత్ వ్యాఖ్యానించాడు. వంతారాలో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ జాతుల చెందిన జీవులు ఉన్నాయి. అరుదైన జంతువులను ఇందులో రక్షిస్తున్నారు. ఈ జంతువులను కాపాడేందుకు సుమారు 400 మంది దాకా పనిచేస్తున్నారు.

ఇష్టా గోష్టి గా మాట్లాడిన అనంత్ ను పలువురు విలేకరులు ఆయన వ్యక్తిగత జీవితం పై ప్రశ్నలు సంధించారు.. “జంతువులతో ఎక్కువ సమయం గడిపితే పెళ్లి తర్వాత పరిస్థితి ఏంటని”? విలేకరులు ప్రశ్నించారు. ” రాధిక కూడా నాలాగే జంతు ప్రేమికురాలు. వాటి కోసం నేను 8 -12 గంటలు కేటాయిస్తున్నాను. అంతేకాదు పెళ్లి తర్వాత నా పని సులభం అవుతుంది. రాధిక కూడా నాతోపాటు జంతు సంరక్షణలో పాలు పంచుకుంటుంది. నాకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఒకవేళ అత్యవసర చికిత్సల కోసం నాకు ఫోన్ వస్తే ఇద్దరం కలిసే వెళ్తామని” అనంత్ ప్రకటించాడు.. జంతువులకు సేవ చేసే భాగ్యం కల్పించిన భగవంతుడిని వేడుకుంటున్నానని అన్నాడు.

జంతు సంరక్షణ పై అనంత్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి మంచి మనసు ఉన్న అనంత్ బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ వంతారా ఏర్పాటుకు సంబంధించి అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. “200 ఏనుగులు, ఎన్నో రకాల జంతువులను వంతారా కాపాడింది. బ్రేవో అనంత్, అండ్ టీమ్” అని కరీనా ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా టార్జా అనే ఏనుగు స్టోరీని కూడా ఆమె నెటిజన్ల తో పంచుకుంది.. ఆ ఏనుగును కాపాడిన వంతారా బృందాన్ని ఆమె అభినందించింది. ఇన్ స్టా లో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.