UP Municipal Elections 2023 : పీ ఎన్నికల మున్సిపల్ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటక ఎన్నికల్లో పడిపోయి రెండో వైపు ఏం జరిగిందో.. జరుగుతుందో మనం అర్థం చేసుకోలేకపోయాం.. కర్ణాటకతోపాటు వెలువడ్డ యూపీ సహా ఉత్తర భారత ఫలితాలను చూసి వదిలేశాం. కానీ వాటిపై సమగ్ర వివరణ చేపట్టలేదు. యూపీ స్థానిక సంస్థలు కూడా అతిపెద్ద ఎన్నికనే..
యూపీ మున్సిపల్ ఫలితాలను చూస్తే కింది చార్ట్ లలో తెలుసుకోవచ్చు.
17 మున్సిపల్ కార్పొరేషన్లు, 199 మున్సిపాలిటీలు, 544 నగర పంచాయితీలకు ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సెమీ అర్బన్ ఏరియాల్లో ఉన్న ఈ నగర పంచాయితీలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం 760 స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలవీ.. ఎన్నో రాష్ట్రాల కంటే ఎక్కువ స్థానిక సంస్థల ఎన్నికలు ఇవీ
పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఏపీలో ఎవరినీ పోటీచేయకుండా బలవంతంగా ఆపేశారు. బెంగాల్ లో అయితే హింస చేసి మరీ రిగ్గింగ్ చేశారు. దారుణంగా దాడులు చేశారు. ఎవ్వరినీ ఆపకుండా దౌర్జన్యం చేశారు.
ఇక యూపీలో మాత్రం చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అంత పెద్ద రాష్ట్రంలో 760 స్థానిక సంస్థలకు ఇంత పకడ్బందీగా హింసకు తావులేకుండా యూపీ సీఎం యోగి జరిపారంటే హ్యాట్సాఫ్ అని చెప్పాలి. ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. యోగికే ఈ క్రెడిట్ ఇవ్వాలి.
యూపీ మునిసిపల్ ఎన్నికలపై సమగ్ర విశ్లేషణ