తెలంగాణ రాజకీయ ముఖచిత్రం గందరగోళంగా ఉంది. ఒకనాడు కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ వైపు నిలబడాలన్న భావన ప్రజల్లో వచ్చింది. కానీ ఎందుకనో రోజురోజుకు కన్ఫ్యూజన్ వస్తుందని అర్థమవుతోంది. సర్వేలు చూస్తే బీజేపీకి అనుకూలంగా వాతావరణం కనిపించడం లేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఏళ్ల తర్వాత సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కేసీఆర్ విషయంలో కుటుంబ పాలన విషయంలో జనాల్లో బాగా వ్యతిరేకత ఉంది. కిందిస్థాయిలో ఎమ్మెల్యేల దోపిడీపై కూడా జనాల్లో వ్యతిరేకతకు కారణమవుతోందన్న చర్చ సాగుతోంది.
ప్రజల్లో ఈ గందరగోళం ఏర్పడడానికి కారణం తెలంగాణలో ఎన్నో పాదయాత్రలు సాగడమే. కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర.. అంతకుముందు వైఎస్ షర్మిల మరోవైపు.. ఆతర్వాత బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు.ఇక వీళ్లు చాలదన్నట్టు ఏపీకి చెందిన టీడీపీ+జనసేన కూడా తెలంగాణలో యాక్టివ్ అయ్యి యాత్రలు చేస్తున్నాయి.
తెలంగాణలో ఇంతటి తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఇటీవల చాణక్య నిర్వహించిన ఒక సర్వే విడుదలైంది. ఈ సంస్థకు విశ్వసనీయత ఉంది. ఈ సర్వేలో కేసీఆర్ కు పాపులారిటీ తగ్గుతోంది. మూడింట ఒకవంతు మంది మాత్రమే కేసీఆర్ ను కోరుకుంటున్నారని తెలిపింది. అయితే ప్రతిపక్షాల ఓట్లు మాత్రం నిట్టనిలువునా చీలుతున్నాయని తెలిపింది.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తెలంగాణలో రెండోస్తానం కాంగ్రెస్ కు ఉంది. 24శాతం మంది ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీజేపీకి కేవలం 19శాతం మాత్రమే ఉందని చెప్పి సర్వే తేల్చింది.దీంతో తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన మరోసారి తప్పదా? అన్న చర్చ మొదలైంది.
తెలంగాణ పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ వీడియోను పైన వీడియోలో చూడొచ్చు.