Telangana Elections 2023 : తెలంగాణలో పోటీలో వున్న అభ్యర్థులపై విశ్లేషణ

ఇక అత్యంత డబ్బులున్న కోటీశ్వరులున్న పార్టీలు చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా 96 శాతం మంది ఉంటే కాంగ్రెస్ లోనూ 94 శాతం మంది ఉన్నారు. బీజేపీలో 84 శాతం మంది ఉన్నారు.

Written By: NARESH, Updated On : November 29, 2023 6:34 pm

Telangana Elections 2023 : ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవ్వాల, రేపు మనం చేసేది ఏమీ ఉండదు. ఓటరు మహాశయులే నిర్ణయం తీసుకోవాలి. ఏడీఆర్ పబ్లిష్ చేసిన అభ్యర్థుల చరిత్ర మీద సంక్షిప్తంగా విశ్లేషిద్దాం.

అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్స్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం 5 రాష్ట్రాల్లో నేరచరితుల సంఖ్య అత్యధికంగా ఉన్నది తెలంగాణలోనే.. తెలంగాణలో పోటీచేసే అభ్యర్థులే ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పోటీచేసే అభ్యర్థుల్లో సివియర్ క్రిమినల్స్ ఉన్నారని తెలిసింది. అభ్యర్థులందరూ సెర్చ్ చేసి మరీ సేకరించిన లిస్ట్ ఇదీ.. రెండోది.. ఆస్తులు ఎక్కువ ఉండి పోటీచేస్తున్న వారిలో ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న అభ్యర్థులే అత్యధికంగా డబ్బులున్న వారే పోటీచేస్తున్నారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణలో తీవ్ర నేరాలు, అత్యధిక డబ్బులున్న వారు తెలంగాణలోనే ఉండడం గమనార్హం.

అత్యధికంగా తెలంగాణలో 72 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులపైనే అత్యధిక నేరచరిత్ర ఉంది. ఇక తర్వాత బీజేపీలో 71 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి.

ఇక అత్యంత డబ్బులున్న కోటీశ్వరులున్న పార్టీలు చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా 96 శాతం మంది ఉంటే కాంగ్రెస్ లోనూ 94 శాతం మంది ఉన్నారు. బీజేపీలో 84 శాతం మంది ఉన్నారు.

తెలంగాణలో పోటీలో వున్న అభ్యర్థులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.