https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్… డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్, ఎలిమినేషన్ తప్పదా?

ఓటింగ్ మొదలైన మొదటిరోజు శివాజీ టాప్ లో ఉన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ గట్టి పోటీ ఇస్తూ.. రెండో రోజు నుంచి మొదటి స్థానానికి వెళ్ళిపోయాడు. దీంతో శివాజీ రెండవ స్థానంలో ఉన్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2023 / 04:37 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో 12వ వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది. దీంతో హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు కాగా 13వ వారం నామినేషన్స్ రంజుగా సాగాయి. ఇక ఈ వారం మొత్తం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. శోభా శెట్టి, శివాజీ, ప్రియాంక, అర్జున్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ సంచలనంగా నమోదయింది. అయితే శివాజీ గత మూడు వరాలు కాస్త వెనుక బడినా .. 13వ వారం సత్తా చాటుతున్నాడు.

    ఓటింగ్ మొదలైన మొదటిరోజు శివాజీ టాప్ లో ఉన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ గట్టి పోటీ ఇస్తూ.. రెండో రోజు నుంచి మొదటి స్థానానికి వెళ్ళిపోయాడు. దీంతో శివాజీ రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా ప్రశాంత్ ప్రస్తుతం ఓటింగ్ లో దుమ్ము దులుపుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే అతను విన్నర్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంది. తర్వాత మూడో స్థానంలో శివాజీ కి మరో ప్రియ శిష్యుడు ప్రిన్స్ యావర్ కొనసాగుతున్నాడు.

    ఇక నాలుగో స్థానంలో అర్జున్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఉంది. ఈ వారం ప్రియాంక ఫినాలే రేస్ లో అదరగొడుతుంది. ప్రతి టాస్క్ లో వంద శాతం ఎఫర్ట్ పెడుతూ మగవారితో సమానంగా ఆడుతూ రేస్ లో ముందుకు సాగుతుంది. ఆ తర్వాత గౌతమ్ అతి తక్కువ ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నాడు. చివరి స్థానంలో శోభ శెట్టి ఉంది. కాగా ప్రస్తుతానికి వీరు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు.

    ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా స్టార్ మా బ్యాచ్ కి చెందిన శోభను కాపాడుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్. ఈ నేపథ్యం లో శోభను సేవ్ చేసి గౌతమ్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.