Analysis on Revanth Reddy Sensational Comments టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంత పచ్చిగా మాట్లాడడం చూసి అందరూ విస్తుపోతున్నారు. రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడన్న సోయి కూడా మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఆయన ఒక రెడ్డి కులసంఘానికి అధ్యక్షుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా లేనప్పుడు ఎవరూ పట్టించుకోరు. కానీ ఇప్పుడు పదవిలో ఉండి అలా మాట్లాడడం దుమారం రేపుతోంది.

ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి అభాసుపాలయ్యారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను బలంగా ఎదుర్కొనే నాయకుడిగా రేవంత్ రెడ్డిని ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. అందుకే రేవంత్ కు ఈ క్రేజ్ వచ్చింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యిండి ఇలా కర్ణాటకలో రెడ్డి సంఘం మీటింగ్ కు హాజరవ్వడం రేవంత్ రెడ్డి చేసిన తప్పు.
ఎస్సీ, ఎస్టీ,బీసీల మీటింగ్ లకు హాజరైతే అది రాజ్యాంగ పరంగా పార్టీలకు లాభం. కానీ అగ్రవర్ణాల మీటింగ్ కు వెళితే అది రాజకీయంగా వికటిస్తుంది. అది రేవంత్ రెడ్డి మరిచిపోతున్నారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన గాలి జనార్ధన్ రెడ్డితో వేదిక పంచుకొని రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడన్నది ఇక్కడ ప్రశ్న.
కేసీఆర్ ను విమర్శించే ముందు తన చుట్టూ ఉన్న వారు.. తన గురించి ముందు రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రెడ్లు అన్ని పార్టీలకు పాలకులు కావాలని.. అధికారం సాధించాలని రేవంత్ అనడం నిజంగా దారుణం. ఈ వ్యాఖ్యలు దళిత, బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ కు దూరమయ్యే అవకాశాలుంటాయి. బీసీ నేతలు రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇక నుంచి రెడ్ల సంఘం అధ్యక్షుడిగా చూడాల్సిన పరిస్థితి. ఈక్రమంలోనే రేవంత్ రెడ్డి తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] Read: Analysis on Revanth Reddy Sensational Comments ఇంత పచ్చిగానా రేవంత… Recommended […]