Pawan Kalyan Janasena Party : 2009లో పీఆర్పీపై.. 2019పై జనసేనపై జరిగిన ప్రచారం తిరిగి షూరు అయినట్టే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పొరపాట్లు చేస్తున్నారని టీవీ9 సహా పలు మీడియాలు వీడియోల పేరుతో విష ప్రచారం చేస్తున్నాయి. జనసేనలో నాయకులు లేరని వారి ఆరోపణ.. పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప జనసేనలో అసలు నాయకులు లేరని ఈ మీడియా ఆడిపోసుకుంటోంది. మరి ఇందులో నిజమెంత? అన్నది చూస్తే..
జనసేనకు ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది. ఒక జిల్లాకు అధ్యక్షుడు ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. లీగల్ సెల్ ఉంది. వీర మహిళా విభాగం ఉంది. ఇంకా అనేక సెల్స్ ఉన్నాయి. మహిళా కమిటీ ఉంది. ఐటీ విభాగం ఉంది. ఈ మీడియాకు వీళ్లు ఎవరూ కనిపించడం లేదా? అన్నది డౌటు.
100 కోట్ల డబ్బుండి.. మీడియా సపోర్టు ఉన్న వారేనా నేతలు.. డబ్బు పలుకుబడి ఉంటేనే నేతలన్నట్టు ఈ మీడియా ఫోకస్ చేస్తోంది. జనసేనలో వాళ్లు లేరు అన్నది వీరి భావన. పీఆర్పీ అనుభవంతోనే జనసేన మెల్లిమెల్లిగా క్రమంగా నేతలను తయారు చేసుకుంటూ ఎదుగుతోంది.
మీడియా విష ప్రచారం.. జనసేనలో నిజంగానే నాయకులు లేరా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.