Rashmika Mandanna: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 5 సంవత్సరాలలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మండన..కన్నడం లో కిరికి పార్టీ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన రష్మిక..ఆ తర్వాత తెలుగు లో చలో అనే సినిమా ద్వారా మనకి పరిచయం అయ్యింది..తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి టాలీవుడ్ లో వరుసపెట్టి ఆఫర్ల వెల్లువ కురిసింది.

ఆ సినిమా తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’,’భీష్మ’ , ‘సరిలేరు నీకెవ్వరూ’ మరియు ‘సీత రామం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఎదిగింది..ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆమె పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించింది..ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది..తెలుగు లో ‘పుష్ప ది రూల్’ లో నటిస్తుంది..తమిళం లో విజయ్ హీరో గా నటిస్తున్న ‘వారిసు’ లో హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఎంత ఎత్తు ఎదిగిన మూలాలు మర్చిపోకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు..కానీ రష్మిక తనకి జీవితం ని ఇచ్చిన వాళ్లనే మర్చిపోయింది అంటూ కన్నడ ప్రజలు పెదవి విరుస్తున్నారు..ఇక అసలు విషయానికి వస్తే రష్మిక ని ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా ద్వారా హీరోయిన్ ని చేసింది కాంతారా హీరో రిషబ్ శెట్టి..ఆ సినిమాకి దర్శకుడు ఆయనే..అలాంటి వ్యక్తి ‘కాంతారా’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు కనీసం శుభాకాంక్షలు కూడా తెలియచెయ్యలేదని..ఈమెకి కన్నడ పరిశ్రమ అంటే చిన్న చూపని..వెంటనే ఆమెని బ్యాన్ చెయ్యాలంటూ ఆరోపించారు కన్నడ ఫ్యాన్స్..ఆమెని బ్యాన్ చేసారని కూడా వార్త వచ్చింది.

అయితే ఈ వార్తలపై రష్మిక స్పందించింది..ఆమె మాట్లాడుతూ ‘సెలబ్రిటీస్ మధ్య ఉండే వ్యవహారాలు బయటి వాళ్ళకి తెలియదు..కాంతారా మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వగానే..ఆ సినిమా యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్ పెట్టాను..మా మధ్య జరిగిన సంబాషలన్నీ కెమెరా ముందు పెట్టలేము కదా..నా పై ఎటువంటి నిషేధం కన్నడ పరిశ్రమ విధించలేదు..త్వరలోనే రెండు మూడు కన్నడ సినిమాలలో నటించడానికి సంతకం కూడా చేశా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.